Illu Illalu Pillalu Today Episode October 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. బయట ఒంటరిగా కూర్చున్న ప్రేమను చూసిన నర్మద మనిషి ఇక్కడుంది మనసు ఎక్కడో ఉంది. ఏంటి సంగతి అని ప్రేమను అడుగుతుంది నర్మద.. అస్సలు విషయాన్ని ప్రేమ నర్మదతో చెప్తుంది. ధీరజ్ నన్ను కిస్ చేసాడో లేదో తెలియలేదు అక్క అని ప్రేమ అంటుంది. నిన్ను ముద్దు పెట్టుకున్నాడో లేదో తెలియనంత అమ్మాయి ఏకంగా ఉన్నావా ఏంటి అని నర్మద అడుగుతుంది. నేను కాస్త డ్రింక్ చేశాను కదా అక్క అందుకే నాకేం తెలియలేదు. ధీరజ్ నిజంగానే నన్ను ముద్దు పెట్టుకున్నాడో లేదో తెలియాలి అని ప్రేమ అనుకుంటుంది.
ముద్దు పెట్టుకున్నాడో లేదో నువ్వే అడిగి తెలుసుకోవా ప్లీజ్ అని నర్మదని రిక్వెస్ట్ చేస్తుంది ప్రేమ. ఏం మాట్లాడుతున్నావ్ ఇలాంటివన్నీ నేను ఎలా అడగాలి అని నర్మదా అంటుంది. ధీరజ్ రావడం చూసి అక్క నువ్వు అడగాలి అక్క అనేసి వెళ్ళిపోతుంది ప్రేమ. ఇంట్లో బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. అందరూ కూడా బతుకమ్మను తయారు చేయడంలో నిమగ్న అయిపోతారు. భార్యల దాడి నుంచి భర్తలు తప్పించుకొని వెళ్ళిపోతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. భద్రావతి తన చెల్లెల్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. బతుకమ్మ సంబరాలు మేమిద్దరం కలిసి చేసేవాళ్లం మా ఇంట్లో మా చెల్లెలు లేదు నా మేనకోడలు లేదు.. అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రేమ, వేదవతి ఇద్దరూ కూడా తమ పుట్టింటి గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటారు. నర్మదా ఇద్దరినీ ఓదారుస్తుంది.. అయితే నర్మదా ఎలాగైనా సరే ప్రేమ పుట్టింటి వాళ్ళతో కలపాలని అనుకుంటుంది. ఇక నర్మదకు వేదవతి సపోర్టుగా ఉంటుంది. మా పుట్టింటి వాళ్ళని మేము దూరం చేసుకుని చాలా బాధపడుతున్నాము అని అనగానే నర్మదా రేపు బతుకమ్మ సంబరాలు మీ కుటుంబంతో మిమ్మల్ని కలిపేస్తాను అని మాట ఇస్తుంది.. ఆ మాట వినగానే ప్రేమ సంతోషపడుతుంది.
ఆరోజు రాత్రి ఆ ఊరిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. రామరాజు కుటుంబం ఎంతో సంతోషంగా వాళ్ళు చేసిన బతుకమ్మలను అక్కడ పెట్టి ఆటపాటలతో ఆకట్టుకుంటారు. భద్రావతి కుటుంబం కూడా బతుకమ్మను తీసుకురావడం చూసినా నర్మదా ప్రేమ అదిగో మీ వాళ్ళు వస్తున్నారు పదా అని అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతుంది.. చెప్పిన ప్లాను గుర్తుంది కదా దాని ప్రకారం మనం చేస్తే కచ్చితంగా మనం అనుకున్నది చేసేద్దామని నర్మదా అంటుంది.
భార్యల కళ్ళల్లో సంతోషాన్ని చూసిన భర్తలు మురిసిపోతూ ఉంటారు. బతుకమ్మలను పెట్టిన వీళ్ళందరూ ఎంత సంతోషంగా ఉన్నారు కదా అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం విన్న రామరాజు. భార్యలు సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు పుట్టింటికి దూరమై ఎంత బాధ అనుభవిస్తున్నారో మీకు తెలియడం లేదు. నేను మీ అమ్మని అలానే తీసుకుని వచ్చాను. ఇప్పటికీ తాను బాధపడుతూనే ఉంది అని రామరాజు అంటాడు. పుట్టింటికి దూరమైన ఆడపిల్లకు ఎంత బాధ ఉంటుందో చెప్పిన అర్థం కాదు అని రామరాజు అనగానే ముగ్గురు కొడుకులు బాధ పడతారు.
తన పుట్టింటి వాళ్ళు రావడం చూసినా వేదవతి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. శ్రీవల్లి ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య అని అడుగుతుంది. బతుకమ్మ అయింది కదా కొన్ని పూలు కావాలి తీసుకొని వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ నర్మదా వెళ్ళిపోతుంటే వేదవతి మీకు ఎంత చెప్పినా అర్థం కాదా నేను చెప్పింది అప్పుడే మర్చిపోయారా అని నర్మదా అంటుంది.. ఇక ప్రేమ నర్మదా వల్ల పుట్టింటి వాళ్ళని చూసి సంతోషంగా ముందుకు వెళుతూ ఉంటారు రేవతి చేతిలోని బతుకమ్మను ప్రేమ చేతిలోకి వచ్చేలా నర్మద చేస్తుంది.
భద్రావతి మాత్రం ఆ బతుకమ్మని నువ్వు తీసుకో మనం వెళ్దామని ఎంత చెప్పినా సరే నర్మదా అలా చేయకూడదు ఎవరి చేతిలో అయితే బతుకమ్మ వచ్చిందో వాళ్ళు అక్కడ పెట్టాలి అని అంటుంది. దానికి భద్రవతి అలాంటివి ఏమి జరగవు అని ఎంత వాదించినా నర్మద చెప్పిన మాటకి ఎదురు చెప్పలేక ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతారు. మొత్తానికి నర్మదనకున్న ప్లాను సక్సెస్ అవుతుంది. ప్రేమ వాళ్ళ పుట్టింటి బతకమని తీసుకెళ్లి అక్కడ పెడుతుంది. ఆ తర్వాత వేదవతి నర్మదపై ప్రశంసలు కురిపిస్తుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా నువ్వు తట్టుకోలేవు నా బంగారు కోడలు గాని మెచ్చుకుంటుంది..
Also Read : పల్లవికి కొత్త టెన్షన్.. అవని మాటతో దిమ్మతిరిగే షాక్.. కమల్ కు అనుమానం..
వాళ్లందరూ సంతోషంగా ఉండడం చూసిన నర్మదా మురిసిపోతూ ఉంటుంది. అయితే నర్మద దగ్గరకొచ్చిన సాగర్ నువ్వు ఎంత బాధ పడుతున్నావో నాకు అర్థమైంది నీ పుట్టింటి వాళ్ళు గుర్తొచ్చారా అని అడుగుతాడు. ఒకసారి అటు చూడు అని చెప్పగానే నర్మద వాళ్ళ అమ్మ నాన్న ఎదురుగా కనిపిస్తారు వాళ్ళని చూసి సంతోషంగా ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..