BigTV English

IPL 2025 : ఐపీఎల్ 2025 ఎలిమినేట్..క్యాటరింగ్ చేసుకుంటున్న రాజస్థాన్, చెన్నై !

IPL 2025 : ఐపీఎల్ 2025 ఎలిమినేట్..క్యాటరింగ్ చేసుకుంటున్న రాజస్థాన్, చెన్నై !

IPL 2025 : ఐపీఎల్ 2025లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్ధాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించాయి. అయితే వీటి పరిస్థితి గత ఏడాది అద్భుతంగా ఉండేది. కానీ ఈ ఏడాది పేలవ ప్రదర్శన చేస్తూ అభిమానులందరితో తిట్లు తిట్టించుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును అయితే ఆర్సీబీ అభిమానులు ఘోరంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించాయని.. ఈ రెండు జట్లు ప్లేయర్లు క్యాటరింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ఓ వీడియో ట్రోలింగ్ కావడం విశేషం.


Also Read : IPL 2025 suspension: ఐపీఎల్ నిరవధిక వాయిదా..ఎన్ని కోట్ల నష్టమంటే ?

ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2వ స్థానంలో కొనసాగుతుండగా.. పంజాబ్ కింగ్స్ మూడో స్థానం, ముంబై ఇండియన్స్ 4వ స్థానంలో ఉన్నాయి. ఈ సీజన్ లో చెన్నై జట్టు అన్ని జట్ల కంటే కూడా చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. చెన్నై జట్టు ట్రోలింగ్స్ కి గురైనట్టు మరే జట్టు కూడా కాలేదు. ఆర్సీబీ అభిమానులు పని గట్టుకొని మరీ చెన్నై జట్టు పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్ లో 3 లేదా 4 మ్యాచ్ లు సునాయసంగా గెలిచే మ్యాచ్ లను చేజేతులారా చెడగొట్టుకొని ప్లే  ఆప్స్ నుంచి నిష్క్రమించింది. తొలుత అంతగా ఫామ్ లో లేని ముంబై జట్టు తరువాత పుంజుకొని అద్భుతమైన ఫామ్ లోకి వచ్చింది.


మరోవైపు ఇండియా-పాక్ ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో వారం రోజుల పాటు వాయిదా వేసింది బీసీసీఐ. తాజాగా ఐపీఎల్  2025 ను పునః ప్రారంభించే దిశగా బీసీసీఐ ప్రయత్నాలు ప్రారంభించింది.  ముఖ్యంగా  మంగళవారం (మే 13)లోపు  పంజాబ్ కింగ్స్ జట్టు మినహా అన్ని  ఐపీఎల్ జట్ల ఆటగాళ్లు తమ వేదికల్లో (హోం గ్రౌండ్లు) అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు సూచించినట్లు తెలుస్తోంది. త్వరలో కొత్త షెడ్యూల్ను రూపొందించి ఐపీఎల్ ని తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని ఫ్రాంచైజీలకు బీసీసీఐ తెలియజేసినట్లు సమాచారం. తమ విదేశీ ఆటగాళ్ల ప్రయాణ ప్రణాళికలను తెలియజేయాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్రాంఛైజీలు తమ విదేశీ ప్లేయర్లను వెనక్కి రప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. మే 13 వరకు అన్ని జట్ల ఆటగాళ్లు అందుబాటులోకి వస్తే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 25నే ఐపీఎల్ ముగించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇక మిగిలినటువంటి  12 లీగ్ మ్యాచ్లను డబుల్ హెడర్లతో త్వరగా ముగించాలని ప్లాన్ చేస్తోందని సమాచారం. పంజాబ్ కింగ్స్ కి  తటస్థ వేదిక కేటాయిస్తారని తెలుస్తోంది.  ఆ వేదికను ఇంకా ఖరారు చేయలేదని సమాచారం. భారత ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే మే 15 లేదా 16న ఐపీఎల్ 2025 సీజన్ పున: ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×