IPL 2025 suspension: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్.. ఇటీవల నిరవధిక వాయిదా పడింది. ఈ వాయిదా కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి బోర్డుతోపాటు బ్రాడ్ కాస్టర్లకు భారీ నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ఈ నష్టం కోట్లల్లో ఉందని… నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య గురువారం రోజున అర్ధరాత్రి యుద్ధం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే అర్ధాంతరంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ను ఆపేశారు. ముఖ్యంగా ధర్మశాల వేదికగా సగం జరిగిన పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ కూడా రద్దు చేశారు.
Also Read: Hardik Pandya : తోటి ప్లేయర్ ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు.. అందుకే హార్దిక్ పాండ్యాకు విడాకులు !
ఐపీఎల్ నిరవధిక వాయిదా…నష్టం ఎన్ని కోట్లు అంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నిరవధికంగా వాయిదా పడడంతో… దాదాపు 300 కోట్ల నుంచి 425 కోట్ల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఇప్పటివరకు ఐదు రోజుల మ్యాచ్ ఆగిపోయింది. ఒక్కో మ్యాచ్ కు సుమారు 60 కోట్ల చొప్పున.. లెక్క వేస్తే 300 నుంచి 425 కోట్ల వరకు నష్టపోయినట్లు జాతీయ మీడియాలో ఒక వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఐదు రోజుల పాటు జరిగే మ్యాచ్ లు నిర్వహించలేదు. మరో రెండు రోజులపాటు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అంటే వారం రోజుల మ్యాచ్ లు పూర్తిగా వాయిదా పడ్డాయి. ఈ 425 కోట్ల నష్టం కేవలం భారత క్రికెట్ నియంత్రణ మండలికి మాత్రమే. బ్రాడ్ కాస్టర్లకు పెద్ద బొక్కే పడింది. వాళ్లకు దాదాపు 5500 కోట్లు నష్టం జరిగినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంటే పాకిస్తాన్ కారణంగా ఎంత పెద్ద నష్టం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Also Read: IPL 2025 – BCCI: ఐపీఎల్ 2025 కొత్త షెడ్యూల్.. ప్రతిరోజు రెండు మ్యాచ్ లు, 8 రోజుల్లోనే ఫినిష్