BigTV English

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Sanju Samson – CSK : సాధారణంగా ఐపీఎల్ కి ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక సంవత్సరం ఒక జట్టులో ఆడిన ఆటగాళ్లు.. మరో సంవత్సరం మరో జట్టులోకి వెళ్తుంటారు. కొందరూ ఒకే జట్టులో ఉంటే.. మరికొందరూ వారి ఆట, ప్రతిభ ఆధారంగా రకరకాల కారణాలు వేర్వేరు జట్టులోకి మారుతుంటారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ లోకి మరో కీలక టీమిండియా ఆటగాడు రానున్నట్టు సమాచారం. ఆ ఆటగాడి కారణంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి CSK లోకి రావాలనుకున్న సంజు శాంసన్ కి షాక్ తగిలిందనే సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ లో కనీసం ప్లే ఆప్స్ కి కూడా చేరుకోలేక పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఆ జట్టుకు సంజు శాంసన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.


Also Read : Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే 

ట్రేడ్ ద్వారా కొనుగోలు.. 


అయితే 2026లో సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ తాజాగా మరో వార్త వైరల్ అవ్వడం విశేషం. కేఎల్ రాహుల్ ని తీసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.   ట్రేడ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్ ని కొనుగోలు చేయాలని ఆసక్తిగా ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. 2025 సీజన్ లో రాహుల్ ఢిల్లీ జట్టు తరుపున ఆడాడు. అయితే ఇప్పుడు 2026 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టులోకి తీసుకోవాలని.. ఈ విషయంలో రాహుల్ అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. రాహుల్ కనుక  చెన్నై జట్టులోకి వస్తే రూ. 25 కోట్లు ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇప్పటికే మహేంద్రసింగ్ ధోని వికెట్ కీపర్ రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరితే.. ఏకంగా ఇద్దరూ వికెట్ కీపర్లు..  స్టార్ బ్యాటర్లతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2026లో రచ్చ రచ్చ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు సీఎస్కే అభిమానులు.

 CSK లోకి టీమిండియా కీలక ప్లేయర్..? 

అయితే సంజు శాంసన్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ లోకి వస్తున్నాడని వార్తలు వినిపించాయి. కానీ దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కేఎల్ రాహుల్ ని తమ జట్టులోకి తీసుకోవాలని కోల్ కతా జట్టు కూడా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ఐపీఎల్ లో ఈ ట్రేడింగ్ విండో సీజన్ ముగిసిన ఏడు రోజుల తర్వాత నుంచి యాక్షన్ {వేలం}కి మరో వారం రోజుల ముందు వరకు తెరిచి ఉంటుంది. ఈ సమయంలో అన్ని జట్లు తమ ఆటగాళ్లను మార్పిడి చేసుకోవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సంజూ, కేఎల్ రాహుల్.. చెన్నై సూపర్ కింగ్స్ తో ట్రేడ్ కాబోతున్నారని,..అంతా సవ్యంగా జరిగితే వచ్చే సీజన్ లో వీరిద్దరూ సీఎస్కే లో భాగస్వాములు అవుతారని ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందని వేచి చూడాలి మరీ.

 

Related News

IND Vs PAK : టాస్ గెలిచిన టీమిండియా.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

BCCI : బీసీసీఐలో ప్ర‌క్షాళ‌న‌..కొత్త అధ్య‌క్షుడు ఇత‌నే.. ఐపీఎల్ కు కొత్త బాస్

IND Vs PAK : టీమిండియాతో మ్యాచ్‌..సైకాల‌జిస్ట్ ను రంగంలోకి దించుతోన్న పాక్‌

Watch Video : డాల్ఫిన్స్ కు కూడా రొనాల్డో తెలుసా… ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

IND Vs PAK : నేడు పాకిస్తాన్ వ‌ర్సెస్ టీమిండియా మ్యాచ్.. “నో షేక్ హ్యాండ్” త‌రువాత మ‌రో స‌మ‌రం

Big Stories

×