Usthad Bagath Singh: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా కోసం ఎదురు చూడడానికి మెయిన్ రీజన్ కాంబినేషన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అందుకుంది.
ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయాయి. అయితే సినిమాలు ఫెయిలవుతున్న కొద్ది పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ పెరిగింది. అలానే పవన్ కళ్యాణ్ మార్కెట్ కూడా పెరిగింది. జల్సా సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇక గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద చూపించండి.
ఉస్తాద్ పై సమ్మె ఎఫెక్ట్
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ సు ఫ్రమ్ సో అనే సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ వెంట నిర్వహించింది కొద్దిసేపటి క్రితం. ఈ ఈవెంట్ లో మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఎర్నేని కూడా పాల్గొన్నారు. అయితే ఒక ప్రముఖ జర్నలిస్ట్ నవీన్ ను ప్రశ్నిస్తూ… ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన సమ్మె ఎఫెక్ట్ ఏమైనా పడిందా ? అని అడిగారు.
నవీన్ మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గారి సీన్స్ కు సంబంధించి ఇంకా ఏడు రోజులు పెండింగ్ వర్క్ ఉంది. ఆ తర్వాత ఇంకో 25 డేస్ రోజులు సినిమా వర్క్ ఉంటుంది. ఈలోపు ఈ కార్మికుల ఇష్యూ క్లియర్ అయిపోతే మేము ఆ పని మొదలుపెడతాం. పండగకు వస్తున్నాము అని ఖచ్చితంగా చెప్పలేం. ఇంకా షూటింగ్ దశలోనే ఉంది కాబట్టి రిలీజ్ డేట్ గురించి పెద్దగా ఆలోచించలేదు. అది ఫిక్సయిన వెంటనే చెబుతాం. ప్రస్తుతం ఈ సినిమా గురించి మాట్లాడండి అంటూ నవీన్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్
పవన్ కళ్యాణ్ ను ఎలా చూపిస్తే ఆడియన్స్ ఇష్టపడతారు అనే విషయంలో హరీష్ శంకర్ కు మంచి క్లారిటీ ఉంది. గతంలో గబ్బర్ సింగ్ సినిమా ద్వారా అది ప్రూవ్ అయింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో చాలా స్టైలిష్ గా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కూడా కనిపిస్తున్నారు. ఇప్పటికే సెట్స్ నుంచి లీకైన కొన్ని ఫోటోలు సినిమా మీద అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Ka Paul : విజయ్ దేవరకొండ తక్షణమే నువ్వు క్షమాపణ చెప్పాలి, నేనే యాక్షన్ తీసుకుంటాను