Rashid Khan : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏ ఆటగాడు ఏవిధంగా ఫామ్ లో ఉంటాడో ఊహించడం కష్టం అనే చెప్పాలి. కొన్ని సందర్భాల్లో సీనియర్ బ్యాటర్ విఫలం చెందుతాడు. కొన్ని సందర్భాల్లో బౌలర్లు కూడా అద్భుత ఫామ్ లో ఉన్న వారు ఫామ్ కోల్పోతుంటారు. మరికొన్ని సందర్భాల్లో బౌలర్లు అద్బుతంగా బ్యాటింగ్ చేస్తే.. మరికొన్ని సందర్భాల్లో బ్యాటర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. ఇలాంటి సందర్భాలు మనం చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. అప్గానిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అద్భుతమైన బ్యాటింగ్ చేసాడు. సరికొత్త షాట్ కనిపెట్టాడనే చెప్పాలి. ఈ షాట్ చూసి చరిత్రలో నిలిచి పోవడం గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Grace Hayden on Pant: రిషబ్ పంత్ పై ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురు మోజు.. బోల్డ్ కామెంట్స్ వైరల్ !
వెరైటీ షాట్ ఆడిన రషీద్
రషీద్ ఖాన్ ని యార్కర్ వేయగా.. ఆ బాల్ ని వెరైటీ షాట్ ఆడి సిక్స్ కొట్టాడు. ప్రస్తుతం ఈ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్టైల్ లోనే వెరైటీగా హెలికాప్టర్ షాట్ ఆడి సిక్స్ ఆడటంతో రషీద్ ఖాన్ క్రికెట్ లో కొత్త షాట్ కనిపెట్టాడు కదా ..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ లో ఈ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ టోర్నీలో ఓవల్ ఇన్విన్సిబుల్స్ వర్సెస్ బర్మింగ్ హామ్ ఫీనిక్స్ జట్ల మధ్య రసవత్తరమైన పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ లియామ్ లివింగ్ స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ లీగ్ లో బర్మింగ్ హమ్ ఫినిక్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు లివింగ్ స్టోన్. కేవలం 27 బంతుల్లోనే 7 ఫోర్లు, ఐదు సిక్సుల సాయంతో 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి తన జట్టును గెలిపించాడు. ఓవల్ ఇన్విన్సిబుల్స్ బౌలర్ రషీద్ ఖాన్ పై విచురుకుపడ్డాడు. కేవలం ఒకే ఓవర్ లోనే 5 బంతుల్లో 26 పరుగులు చేయడం విశేషం.
లివింగ్ స్టోన్ ఉచకోత
రషీద్ ఖాన్ బౌలింగ్ లో లివింగ్ స్టోన్ చెలరేగితే.. రషీద్ ఖాన్ బ్యాటింగ్ చేసి రికార్డు నెలకొల్పారు. ఇక రషీద్ ఖాన్ వేసిన ఓవర్ లో వరుసగా 5 బంతుల్లో 4, 6, 6, 6, 4 తో లివింగ్ స్టోన్ ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ 20 బంతులు వేసి 59 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. ఇప్పటివరకు 100 లీగ్ లో ఇదే అత్యంత ఖరీదైన స్పెల్. దీనికంటే ముందు రషీద్ ఖాన్ టీ-20 గణాంకాలు 2018 ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ పై నాలుగు ఓవర్లలో 55 పరుగులు నమోదు అయ్యాయి. తాజాగా రషీద్ ఖాన్ నమోదు చేసిన ఈ చెత్త స్పెల్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. మరోవైపు అంతకు ముందు రషీద్ బ్యాటింగ్ లో చెలరేగి.. ఇప్పుడు బౌలింగ్ లో పరుగులు సమర్పించుకోవడం ఆశ్చర్యకరమనే చెప్పవచ్చు.
?igsh=cHA3cjhtcmJjYzJn