BigTV English

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్
Ravichandran Ashwin sets world record in Ind vs Ban Test Match: టీమ్ ఇండియాలో అద్భుత ఆటగాడు.. ఎక్కువ ప్రచారాన్ని ఆశించని ఆటగాడు, 38 ఏళ్లు వచ్చాక కూడా ఇంకా కుర్రాడిలా క్రికెట్ ఆడే వాడు ఒక్కడే ఉన్నాడు. అతనే రవిచంద్రన్ అశ్విన్.  క్రీజులోకి వచ్చాడంటే.. అతనిలో ఎంతో పట్టుదల కనిపిస్తుంది. ఒక స్పిరిట్ ఉంటుంది. అంకిత భావం ఉంటుంది.

తనని ఎన్నిసార్లు బెంచ్ కే పరిమితం చేసినా అదరడు, బెదరడు, అదే నవ్వుతో ఉంటాడు. ఏ మాత్రం మొహమాటం లేకుండా  క్రీజులో క్రికెటర్లకి డ్రింక్స్ ఇస్తుంటాడు. అవకాశం వస్తే మాత్రం.. ఇదే తన తొలి మ్యాచ్ అన్నంత రీతిలో కష్టపడి ఆడతాడు.


హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే ఇలా వీరందరికి వచ్చినంత పేరు తనకి రాలేదు. తను కూడా 500 వికెట్ల క్లబ్ లో చేరాడు. ప్రస్తుతం 516 వికెట్లతో దూసుకుపోతున్నాడు. వన్డేల్లో 156 వికెట్లు తీశాడు. టీ 20ల్లో 72 వికెట్లు తీశాడు. మొత్తం అన్ని ఫార్మాట్లు కలిపి 744 వికెట్లు తీశాడు.  కానీ ఎప్పుడూ పేరు కోసం పాకులాడలేదు. తన ఆటేదో తను ఆడతాడు. గేమ్ వ్యూహాల్లో పార్టిసిపేట్ చేస్తాడు. తను విలువైన సూచనలిస్తాడు.

ఆటంతా అయిపోయాక ఇంటికి వెళ్లిపోతాడు. కానీ ప్రతిరోజు ప్రాక్టీస్ మాత్రం చేస్తాడు. తప్పనిసరిగా చిన్నా పెద్దా కాదు. ప్రతి లీగ్ మ్యాచ్ ల్లో ఆడతాడు. ఇప్పుడు కూడా అదే తీరుతో ఆడి శభాష్ అనిపించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలిటెస్టు మ్యాచ్ లో ప్రధాన బ్యాటర్లందరూ వెనుతిరిగితే, రవీంద్ర జడేజా అండతో సెంచరీ చేసి అందరి దృష్టి ఆకర్షించాడు. టీమ్ ఇండియా హీరోలా నిలిచాడు.


Also Read: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

ఈ క్రమంలో భారత్ లో ఇద్దరు లెజండరీ క్రికెటర్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ కూడా స్వదేశంలో ఏడో స్థానం అంతకంటే దిగువన బ్యాటింగుకి వచ్చి 4 సెంచరీలు చేశారు. అశ్విన్ కూడా వారి సరసన చేరాడు. అయితే ఓవరాల్ గా అశ్విన్ 5 సెంచరీలు, కపిల్ దేవ్ 8 సెంచరీలు, ధోనీ 6 సెంచరీలు చేశారు.

అయితే చెన్నయ్ వేదికగా అశ్విన్ కి ఇది రెండో సెంచరీ. జడేజాతో కలిసి కేవలం 225 బంతుల్లో 199 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ పార్టనర్ షిప్ మిస్ అయ్యారు.

Related News

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

Big Stories

×