BigTV English

Ravichandran Ashwin : మైకేల్ వాన్ కొంచెం తగ్గమ్మా తగ్గు: అశ్విన్

Ravichandran Ashwin : మైకేల్ వాన్ కొంచెం తగ్గమ్మా తగ్గు: అశ్విన్
Ravichandran Ashwin

Ravichandran Ashwin : టీమ్ ఇండియాపై ఎప్పుడూ ఒంటికాలిపై లేచే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మాటలపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటుగా స్పందించాడు.  ఇంతకీ మైకేల్ వాన్ ఏమన్నాడంటే గత పదేళ్లుగా టీమ్ ఇండియా ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోయింది. ఊరికినే పబ్లిసిటీ స్టంట్ తప్ప ఏమీలేదని అన్నాడు.  


సామర్థ్యం, నైపుణ్యం కలిగిన ఆటగాళ్లతో ఉన్న టీమిండియా ఎన్నో ఘనతలు సాధించాలి. కానీ అలా జరగలేదు” అని మైకేల్ వాన్ అన్నాడు. దీనికి కొంచెం ఆలస్యంగా అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పందించాడు.
ఈమధ్య కాలంలో మేం ఐసీసీ టోర్నీలు సాధించలేకపోతున్నాం. ఆ మాట నిజమే కానీ, విదేశాల్లో పర్యటించే టాప్ జట్లలో టీమ్ ఇండియా కూడా ఒకటని అశ్విన్ అన్నాడు.

టెస్ట్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఓడిపోయి ఉండవచ్చు, వన్డే వరల్డ్ కప్ 2023లో ఓడిపోవచ్చు కానీ విదేశాల్లో టీమ్ ఇండియా ఎన్నో గొప్ప సిరీస్ లను గెలిచి, విజయాలు సాధించిన విషయాన్ని మరిచిపోకూడదని వాన్ కు గుర్తు చేశాడు.


మైకేల్ వాన్ పరాయి దేశస్తుడు, తన దేశం మీద తనకి అభిమానం ఉంటుంది. అందుకనేదో మాట్లాడాడు. కానీ స్వదేశంలో కొందరు మైకేల్ వాన్ మాటలను సమర్థించడం చూస్తే నాకు నవ్వు వచ్చిందని అన్నాడు. అందరూ ఒకసారి ఆలోచించండి.

సౌతాఫ్రికాలో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఒక వేళ సౌతాఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఉంటే 65 పరుగులకే ఆలౌట్ అయిపోయేదేమో, ఎవరికి తెలుసునని అన్నాడు. కానీ టీమ్ ఇండియా అదే పిచ్ మీద 245 పరుగులు చేసిందని అన్నాడు.

కేఎల్ రాహుల్ సెంచరీని ఎవరూ మరిచిపోలేరని అన్నాడు. మైకేల్ వాన్ అనే కాదు, SENA దేశాలు అందరికీ కూడా ఇండియాను విమర్శించడం అలవాటుగా మారిందని అన్నాడు. ఇంతకుముందులా ఎవరూ నోరు మూసుకుని కూర్చోరని తెలిపాడు.  ఇక నుంచి ఇండియా గురించి మాట్లాడేటప్పుడు మైకెల్ వాన్… కొంచెం ఆలోచించి మాట్లాడమని సలహా ఇచ్చాడు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×