Ravindra Jadeja Announced Retirement From T20Is: టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలిచిన తర్వాత ఒక్కొక్కరు టీ20లకు గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా తాజాగా రవీంద్ర జడేజా వీడ్కోలు పలికాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటించాడు లెఫ్ట్ ఆర్మ్ ఆల్ రౌండర్.
టీ20 ప్రపంచకప్ గెలవడం తన కల అని.. అది సారామైందని.. కృతజ్ఞత నిండిన హృదయంతో టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు జడేజా.
ఇప్పటివరకు 74 టీ20 మ్యాచులు ఆడిన రవీంద్ర జడేజా 515 పరుగులు చేశాడు. అలాగే 54 వికెట్లు తీసుకున్నాడు. రవీంద్ర జడేజా మెరుపు ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు. మైదానంలో పాదరసంలా కదులుతూ అసాధారణమైన క్యాచులు అందుకోవడంలో నేర్పరి.
2022లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 29 బంతుల్లో 49 పరుగులు చేశాడు. ఇదే టీ20ల్లో జడేజా అత్యుత్తమ ప్రదర్శన. 2021 ప్రపంచ కప్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకుని అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
ఇదిలావుండగా, శనివారం కెన్సింగ్టన్ ఓవల్‌లో భారత్ విజయాన్ని పురస్కరించుకుని స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ T20Iలకు వీడ్కోలు పలుకుతూ తమ నిర్ణయాన్ని ప్రకటించారు. 76 పరుగులతో టాప్ స్కోర్ చేసినందుకు గానూ ఫైనల్‌లో కోహ్లి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. T20 ప్రపంచ కప్ చరిత్రలో టాప్ స్కోరర్‌గా తన కెరీర్‌ను ముగించాడు.
Also Read: హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి
కెప్టెన్ రోహిత్ మూడు అర్ధసెంచరీల సహాయంతో 257 పరుగులతో టోర్నమెంట్‌లో భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. అలాగే కోహ్లీ ఆల్-టైమ్ రికార్డును అధిగమించి T20Iలలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కెరీర్‌ను అద్భుతంగా ముగించాడు.