BigTV English

RCB Fans: కొండగట్టు అంజన్నా.. మా RCB కప్పు కొట్టాలి

RCB Fans: కొండగట్టు అంజన్నా.. మా RCB కప్పు కొట్టాలి

RCB Fans:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. దాదాపు 18 సంవత్సరాలుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ రాలేదు. అయితే ఈసారి కచ్చితంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కప్పు గెలుస్తుందని… సోషల్ మీడియాలో ఫాన్స్ రచ్చ చేస్తున్నారు. ఫైనల్ దాకా వెళ్ళిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి టైటిల్ ఎగరేసుకుపోతుందని అంచనా వేస్తున్నారు.


Also Read: GT VS MI, Eliminator: గుజరాత్ ఓటమి.. పంజాబ్ తో ముంబై క్వాలిఫయర్ 2 మ్యాచ్… టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి

కొండగట్టు అంజన్న కుండీలో చీటీలు


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్  ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో ఈసారి.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవాలని…. బెంగళూరు అభిమానులు రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే… ఓ అభిమాని.. చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు అంజన్న స్వామి చాలా పాపులర్ అన్న సంగతి తెలిసిందే. అయితే కొండగట్టు అంజన్న ను ఏది మొక్కిన… కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే.. 18వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవాలని… కొండగట్టు అంజన్న హుండీలో  ( Kondagattu Anjanna Hundi ) ఆర్సిబి అభిమాని ఒక చిట్టి రాసి వేశాడు. ఐపీఎల్ – 2025లో ఆర్సీబీ కప్పు కొట్టాలని “Please God this year RCB won that trophy” అంటూ కొండగట్టు ఆంజనేయ స్వామికి చీటి రాసిన ఆర్సీబీ అభిమాని.. అందరికి షాక్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

17 సంవత్సరాలుగా టైటిల్ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team ) ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. గత 17 సంవత్సరాలుగా టైటిల్ కోసం… ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. కానీ ఫైనల్ దాకా వచ్చి చాలాసార్లు ఓడిపోయింది. ఇప్పటి వరకు మూడుసార్లు ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అయితే ఈసారి కచ్చితంగా గెలవాలని… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. కొంతమంది అభిమానులు అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. మరి ఈసారి ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి. కాగా రేపటి రోజున క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్…. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో గెలిచిన జట్టు… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తెలపడనుంది.

Also Read: Gill Pandya Fight: గ్రౌండ్ లో తన్నుకున్న పాండ్యా, గిల్…బోరున ఏడ్చేసిన ఆశిష్ నెహ్రా ఫ్యామిలీ

Related News

Asia Cup 2025 : బంగ్లా చిత్తు… ఫైనల్ కు పాకిస్తాన్.. టీమిండియాతో బిగ్ ఫైట్

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

PAK Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : స్మృతి మంధానకు ఘోర అవమానం… ఆ ఫోటోలు వైరల్ చేసి!

Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !

Inzamam-ul-Haq : అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్.. అందుకే దారుణంగా ఆడుతున్నాడు

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Big Stories

×