Actress Devayani :హీరోయిన్ దేవయాని అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు.ఈ హీరోయిన్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘సుస్వాగతం’ సినిమాతో ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి మలయాళ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్గా రాణించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో తల్లి,అత్త పాత్రలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే అలాంటి దేవయాని కూతురు తల్లిని మించిన అందం ఉన్నప్పటికీ సినిమాల్లోకి తల్లి వారసత్వంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకుండా డిఫరెంట్ రంగాన్ని ఎంచుకుంది. తాజాగా దేవయాని కూతురు ఓ సింగింగ్ షోలో ప్రత్యక్షమైంది..
హీరోయిన్ దేవయాని కూతుర్ని చూశారా?
ఇక విషయంలోకి వెళ్తే.. హీరోయిన్ దేవయాని కూతురు తాజాగా తమిళ్ సింగింగ్ షో అయినటువంటి సరిగమప సీనియర్ సీజన్ -5 లో కనిపించింది.. సరిగమప సీనియర్ సీజన్ 5 షో కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఆ ప్రోమోలో ఏముందంటే.. దేవయాని కూతురు స్టేజి మీదకి వచ్చేముందు జడ్జెస్ అందరికీ కళ్ళకు గంతలు కట్టేస్తారు. ఆ తర్వాత దేవయాని కూతురు ఇనియా స్టేజ్ మీదకు వచ్చి భారతి సినిమాలోని “మయిల్ పోల పొన్ను ఒన్ను ” అనే పాటను ఎంతో మధురంగా పాడుతుంది. ఆ తర్వాత న్యాయ నిర్ణేతలు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని చూడడానికి తమ కళ్ళగంతలు తీసేసాక.. ఈ అమ్మాయి ఎవరు తెలిసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఆ అమ్మాయి ఎవరో కాదు హీరొయిన్ దేవయాని కూతురు.. ఇది తెలిసి అక్కడ ఉన్న జడ్జెస్ తో పాటు అందరూ షాక్ అయిపోతారు.అయితే దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ ప్రోమోలో దేవయాని మాట్లాడుతూ.. “తన కూతురు తన సపోర్ట్ లేకుండానే ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. నా సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలో ఎదగాలని నేను కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది.
తల్లిలా హీరోయిన్ కాకుండా ఆ రంగంలోకి అడుగుపెట్టిన దేవయాని కూతురు..
అలా ఈ ప్రోమోలో దేవయాని కూతురు ఇనియాని చూసిన చాలా మంది నెటిజన్లు తల్లి హీరోయిన్ అయినప్పుడు కూతురు కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గానే ఎంట్రీ ఇస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ దేవయాని కూతురు ఇనియా మాత్రం హీరోయిన్ గా కాకుండా సింగింగ్ రంగాన్ని ఎంచుకొని సింగర్ ల మారాలనుకోవడం ఏంటో అని కామెంట్లు పెడుతున్నారు.కానీ ఎవరి అభిరుచి వారిది కాబట్టి ఇనియా సింగర్ గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
దేవయాని కెరియర్..
హీరోయిన్ దేవయాని విషయానికి వస్తే..ఒకప్పుడు చాలా సినిమాలో హీరోయిన్ గా నటించిన దేవయాని ప్రస్తుతం కొన్ని సినిమాల్లో మదర్ క్యారెక్టర్స్ చేస్తుంది. అలా జనతా గ్యారేజ్, అరవింద సమేత వంటి సినిమాలు చేసింది. ఇక 2001లో రాజ్ కుమారన్ అనే డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న దేవయాని పెళ్లి తర్వాత కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉండి, ఆ తర్వాత టీచర్ గా కొద్ది రోజులు పిల్లలకు పాఠాలు బోధించింది. ఆ తర్వాత మళ్లీ సినీ రంగంలోకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
ALSO READ:Big TV Exclusive : ‘చెన్నైలో లవ్ స్టోరీ’ స్టార్ట్ చేసిన కిరణ్ అబ్బవరం.. అఫిషియల్‌గా జూన్ 2న అనౌన్స్