GT VS MI, Eliminator: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ టోర్నమెంట్ లోనే.. అసలు సిసలైన మ్యాచ్ ఇది. అలాంటి ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Gujarat Titans vs Mumbai Indians ) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే అనూహ్యంగా ఈ మ్యాచ్ లో… అత్యంత ప్రమాదకరంగా ఆడిన ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 228 పరుగులు చేస్తే… గుజరాత్ మాత్రం 208 వద్దే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది ముంబై ఇండియన్స్. దీంతో క్వాలిఫైయర్ 2 లోకి దూసుకు వెళ్ళింది ముంబై ఇండియన్స్ టీం.
Also Read: PBKS Fans : తెల్లటి డ్రెస్సుల్లో అందాల భామలు..రాం రాజ్ కాటన్ అంటూ ట్రోలింగ్
బ్యాటింగ్ లో దుమ్ము లేపిన ముంబై ఇండియన్స్
అంతకు ముందు మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) అదరగొట్టింది. రోహిత్ శర్మ నుంచి కెప్టెన్ హార్దిక్ పాండ్యా వరకు… అందరు ప్లేయర్లు దుమ్ము లేపారు. ఈ నేపథ్యంలోనే నిర్ణయి ఓవర్లలో ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్న ముంబై ఇండియన్స్ బ్యాటర్లు…. భారీ స్కోర్ చేశారు. ముఖ్యంగా చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) 9 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు. ఇందులో మొత్తం మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ 22 పరుగులే ముంబై ఇండియన్స్ కు చాలా కీలకంగా మారాయి. అటు రోహిత్ శర్మ 81 పరుగులు చేయగా… బెయిర్ స్టో 47 పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేశాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 25 పరుగులతో రాణించాడు.
పంజాబ్ తో ముంబై ఫైట్
ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ఏకంగా 20 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ముంబై ఇండియన్స్. దీంతో నేరుగా క్వాలిఫైయర్ 2 లోకి దూసుకు వెళ్ళింది ముంబై ఇండియన్స్. ఇక ఈ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతోంది. ఈ కీలక మ్యాచ్… జూన్ ఒకటో తేదీన ఆదివారం రోజున జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాదులోని నరేంద్ర మోడీ స్టేడియం లో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక ఈ క్వాలిఫైయర్ 2 లో గెలిచిన జట్టు నేరుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ( Royal Challengers Bangalore team) ఫైనల్ ఆడుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్ జూన్ మూడో తేదీన నరేంద్ర మోడీ స్టేడియంలోనే ( Narendra Modi Stadium) నిర్వహిస్తారు. క్వాలిఫైయర్ 2, ఫైనల్ ఉచితంగా చూడాలంటే జిఓ హాట్ స్టార్ లో చూడొచ్చు.
Also Read: Stoinis Partner : కోహ్లీ ఇజ్జత్ తీసిన స్టోయినిస్ వైఫ్… బండ బూతులు తిడుతూ