Shahid Afridi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ( Indian Premier League 2026 tournament) మెరిసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) టీమిండియాలో అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్, ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్లలో వైభవ్ సూర్యవంశీ ప్రాతినిధ్యం వహిస్తాడు. అంతకు ముందే ట్రై సిరీస్ భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్స్ లో వైభవ్ సూర్య వంశీ అదరగొట్టాడు. 29 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi ). వైభవ్ ను తట్టుకోవడం బౌలర్ల వల్ల అవ్వడంలేదని.. ఇలాంటి నేపథ్యంలో ఐసీసీ కొత్త రూల్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకపోతే బౌలర్ల దెబ్బ తినడం గ్యారంటీ అని హెచ్చరించారు. ఈ విషయంలో ఐసీసీ వెంటనే చర్యలు తీసుకోవాలని.. జై షా పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు షాహిద్ అఫ్రిది.
ట్రై సిరీస్ లో భాగంగా శ్రీలంక పై 11 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు వైభవ్ సూర్య వంశీ. ఓవరాల్ గా 19 బంతుల్లో 94 పరుగులు చేసుకున్న వైభవ్… సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇలాంటి క్రమంలో వైభవ్ సూర్యవంశీ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్ చేసేందుకు… బౌలర్లు భయపడిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని కట్టడి చేసేందుకు ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వన్డేలలో మొదటి 10 ఓవర్లలో బౌండరీ గేటు దగ్గర ఎక్కువ ఫీల్డర్స్ ను పెట్టుకునే వెసులు బాటు కల్పించాలని సరికొత్త డిమాండ్ పెట్టారు. సర్కిల్స్ లో ఎక్కువగా ఫీల్డర్స్ ఉండడం వల్ల.. వైభవ్ రెచ్చిపోయి ఆడుతున్నాడని గుర్తు చేశారు. ఇలాంటి క్రమంలో ఫీల్డింగ్ వెసులుబాటు కల్పిస్తే, బౌలర్లకు ఈజీ అవుతుందని చెప్పుకొచ్చారు. లేకపోతే బౌలర్ల కెరీర్ ను వైభవ్ నాశనం చేస్తాడని హెచ్చరించారు. దీనిపై ఐసీసీ బాస్ జై షా వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే కష్టమేనని పేర్కొన్నారు. అదే సమయంలో 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ వయస్సు విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. అతనికి ఏదైనా డిఎన్ఏ పరీక్ష చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే వైభవ్ సూర్య వంశీ వయస్సు విషయంలో అసలు రంగు బయటపడుతుందని వ్యాఖ్యానించారు. దీంతో షాహిద్ అఫ్రిది (Shahid Afridi ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.