Big TV Exclusive :యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) తాజాగా కొడుకు పుట్టిన సందర్భాన్ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. 2019లో వచ్చిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ సినిమాతో మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన.. ఈ సినిమాలో హీరో మాత్రమే కాదు ఈ సినిమాకి కథ అందించిన రచయిత కూడా. ఆ తర్వాత చాలా సెలెక్టివ్గా కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించిన కిరణ్ అబ్బవరం చివరిగా ‘దిల్ రూబా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు ‘రాజావారు రాణిగారు’ సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరక్ (Rahasya ghorak) తో ఏడడుగులు వేసిన కిరణ్.. ఇటీవల పండంటి కొడుకుకి జన్మనిచ్చారు. ఇక ప్రస్తుతం పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబోతున్న కిరణ్ అబ్బవరం నుండి వచ్చే నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
కిరణ్ అబ్బవరం నెక్స్ట్ ఎంపిక చేసుకోబోయే స్టోరీ పై, తారాగణం పై అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్న వేళ తాజాగా బిగ్ టీవీ కి ఎక్స్క్లూజివ్ గా అందిన సమాచారం ప్రకారం.. కిరణ్ అబ్బవరం త్వరలో రవి నంగ్యారీ డైరెక్షన్లో కొత్త మూవీతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నారు. ఇందులో గౌరీ ప్రియ( Gauri Priya) హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ ‘కలర్ ఫోటో’ నిర్మాత సాయి రాజేష్ (Sai Rajesh) స్టోరీ ని అందించగా.. ఎస్ కే ఎన్ నిర్మాత ధీరజ్ మొగిలినేని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మణిశర్మ (Mani Sharma) ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ ను జూన్ 2వ తేదీన సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిన్న పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే మరొకవైపు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘చెన్నై లవ్ స్టోరీ’ అని టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే చెన్నై లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రానున్న కిరణ్ అబ్బవరం అఫీషియల్ అనౌన్స్మెంట్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కిరణ్ అబ్బవరం కెరియర్:
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈయన 1990 జూలై 15న ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా రాయచోటిలో జన్మించారు. ఇక రహస్య గోరక్ తో ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత హైదరాబాదులో 2024 మార్చి 13న నిశ్చితార్థం చేసుకొని.. ఆగస్టు 2024లో కర్ణాటకలోని కూర్గ్ లో ఒక ప్రైవేటు వెడ్డింగ్ హాల్లో వివాహం చేసుకున్నారు.. ఇక గత వారం రోజుల క్రితమే పండంటి కొడుకుకు జన్మనిచ్చారు. కిరణ్ అబ్బవరం విద్యాభ్యాసం విషయానికి వస్తే.. బీటెక్ పట్టా అందుకున్న ఈయన.. చెన్నై, బెంగళూరులో రెండున్నర సంవత్సరాల పాటు నెట్వర్క్ కన్సల్టెంట్ గా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలు పెట్టిన కిరణ్ ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలి సినిమా కెరియర్ పై ఫోకస్ పెట్టారు. అలా షార్ట్ ఫిలింలలో ఒకటైన శ్రీకారం 2021లో అదే పేరుతో ఫీచర్ ఫిల్మ్ గా పునర్నిర్మించబడింది.
ALSO READ:Kamal Haasan : సినిమాలకు రిటైర్మెంట్ డేట్ ప్రకటించిన కమల్ హాసన్… ఎప్పుడంటే..?