Haris Rauf -Ashwin in MLC 2026: మేజర్ లీగ్ క్రికెట్ 2026 టోర్నమెంట్ ( Major League Cricket 2026 Tournament) అమెరికాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ మొన్న జూన్ 18వ తేదీన ప్రారంభమైంది. జూలై 18వ తేదీ వరకు అంటే నెల రోజుల పాటు కొనసాగనంది. ఈ టోర్నమెంట్ లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. 34 మ్యాచ్ లు ఆడతాయి. ఈ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin), పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ ( Haris Rauf) కూడా పాల్గొంటున్నారు. ఈ ఇద్దరు క్రికెటర్లు ఒకే జట్టుకు ఆడడం గమనార్హం. శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ ( San Francisco Unicorns ) జట్టు తరఫున ఈ ఇద్దరు బరిలోకి దిగుతున్నారు. అంటే ఇద్దరు ఒకే డ్రెస్సింగ్ రూమ్ పంచుకుంటున్నారన్నమాట. ఈ నేపథ్యంలోనే మొన్ననే అశ్విన్ పై దారుణంగా ట్రోలింగ్ మొదలైంది. ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని అశ్విన్ ను చాలామంది డిమాండ్ చేశారు. అయినప్పటికీ అమెరికాకు వెళ్లిన అశ్విన్, మేజర్ లీగ్ క్రికెట్ 2026 టోర్నమెంటులో ఆడుతున్నాడు.
మేజర్ లీగ్ క్రికెట్ 2026 టోర్నమెంట్ ( Major League Cricket 2026 Tournament) ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ తో కలిసి ఫోటోలు దిగారు రవిచంద్రన్ అశ్విన్. ప్లేయర్లు అందరూ ఒకే దగ్గర కూర్చొని ఆటోగ్రాఫ్స్ ఇస్తుండగా… పాకిస్తాన్ బౌలర్ హారిస్ రవూఫ్ పక్కనే అశ్విన్ కూర్చున్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఫోటోలు దిగిన వీడియో వైరల్ గా మారింది. దీంతో అశ్విన్ పై దారుణంగా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు ఇండియన్ ఫ్యాన్స్. అశ్విన్ దేశ ద్రోహి అంటూ ముద్ర వేస్తున్నారు. వెంటనే ఆ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని.. లేకపోతే ఇండియాలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. అవసరమైతే అశ్విన్ పై రాళ్లు విసరుతామని హెచ్చరిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియాకు వార్నింగ్ ఇచ్చిన వాడితో ఫోటో ఎలా దిగుతావని నిలదీస్తున్నారు. అంతకుముందు చాలా మందికి నీతులు చెప్పిన నువ్వు… ఇప్పుడు పాకిస్తాన్ వాళ్లతో బరితెగించి తిరుగుతున్నావా ? అంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా వెంటనే ఇండియాకు తిరిగి వచ్చేసి, గౌరవం కాపాడుకో. లేకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి అని వార్నింగ్ ఇచ్చారు. అయితే, అశ్విన్ ఫ్యాన్స్ మాత్రం.. ఆ ట్రోలింగ్ కు కౌంటర్ ఇస్తున్నారు. అశ్విన్ ఏం పాకిస్తాన్ వాళ్లతో చేతులు కలపడం లేదంటున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==