Gill Pandya Fight: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా కొనసాగింది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో… చివరి వరకు పోరాడి గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు పైన ఏకంగా 20 పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో గుజరాత్ ఇంటిదారి పట్టగా… క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కు ముంబై ఇండియన్స్ సెలెక్ట్ అయింది.
బోరున ఏడ్చిన గుజరాత్ కోచ్ నెహ్ర కుటుంబ సభ్యులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ జట్టు దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో… ఫ్యాన్స్ మొత్తం హార్ట్ అయ్యారు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు అద్భుతంగా రాణిస్తూ వచ్చిన గుజరాత్ టైటాన్స్… కీలక దశలో ఓడిపోయింది. దీంతో ఇంటిదారి పట్టింది గుజరాత్ టైటాన్స్. అయితే గుజరాత్ టైటాన్స్ ఓడిపోయిన నేపథ్యంలో.. ఆ జట్టుకు సంబంధించిన బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్ర ఫ్యామిలీ చాలా ఎమోషనల్ అయింది. ఓడిపోయిన తర్వాత ఆశిష్ నెహ్ర ఫ్యామిలీ కన్నీళ్లు పెట్టుకుంది. ముఖ్యంగా ఆశిష్ నెహ్ర కొడుకులైతే… చాలా ఎమోషనల్ గా కనిపించారు. తమ తండ్రి ఎంతో జట్టును ముందుకు నడిపించాడని… అలాంటిది ప్లేయర్లు సరిగ్గా ఆడకపోవడంతో మ్యాచ్ ఓడిపోయిందనే ఫీలింగ్ లో వాళ్ళు కనిపించారు. అటు గుజరాత్ టైటాన్స్ ఆటగాడు ఆశిష్ నెహ్ర…కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన గుజరాత్ టైటాన్స్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. హాట్ బ్రేకింగ్ అంటూ… కామెంట్స్ పెడుతున్నారు గుజరాత్ టైటాన్స్ అభిమానులు.
గ్రౌండ్ లోనే కొట్టుకున్న గిల్, హార్దిక్ పాండ్యా
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఎలిమినేటర్ మ్యాచ్ నేపథ్యంలో… గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ అలాగే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మధ్య గొడవలు బయటపడ్డాయి. ఈ ఇద్దరు ఈ మ్యాచ్ నేపథ్యంలో చాలా కోపంగా కనిపించారు. ఒకరిని ఒకరు మాట్లాడుకోవడం కూడా చేయలేదు. టాస్ సమయంలో ఇద్దరు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. అలాగే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ వికెట్ పడ్డ నేపథ్యంలో… హార్దిక్ పాండ్యా చాలా ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు. గిల్ దగ్గరికి వెళ్లి… గట్టిగా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు ఇద్దరికీ కొంచెం కూడా బుద్ధి లేదని ఫైర్ అవుతున్నారు. ఇందులో తప్పంతా హార్దిక్ పాండ్యాది అంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read: Jonny Bairstow: పాకిస్థాన్ కంటే దారుణంగా ఫీల్డింగ్ చేస్తున్న గుజరాత్.. ఇలా చేస్తున్నారేంట్రా
Hardik pandya owner of gill and gujrat Titans 😎pic.twitter.com/mvuPZ5Z5uG
— Amar💫 (@KUNGFU_PANDYA_0) May 31, 2025
Ashish Nehra’s kids heartbroken as Gujarat Titans’ IPL 2025 run comes to an end. 💔
Is a amazing game, but an emotional goodbye. 🥺💛 Cricket is passion — felt by players, coaches, and families alike. 🙏 #GTForever#AshishNehra #GT #GujaratTitans #IPL2025 #CricketEmotions pic.twitter.com/zuSa9ocz1P— VIRAL TOPIC 🏏 (@mr_sff8346) May 30, 2025