E-Paper
Advertisement

‘పెద్ది’ నా సినిమా కాపీనే.. డైరెక్టర్ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

‘పెద్ది’ నా సినిమా కాపీనే.. డైరెక్టర్ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Peddi Copy : ప్రముఖ సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ ఓ ఇంటర్వ్యూలో ‘పెద్ది’ సినిమాతో పాటు ప్రస్తుత చిత్ర పరిశ్రమ ట్రెండ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కీచురాళ్ళు, కోకిల వంటి క్లాసిక్ సినిమాలతో తనదైన ముద్ర వేసుకున్న ఆయన, నేటి సినిమాల నిర్మాణ శైలి, కలెక్షన్ల లెక్కలు, రివ్యూల ప్రభావంపై కుండబద్దలు కొట్టారు.పనిలో పనిగా పెద్ది సినిమాలోని ముఖ్యమైన సీన్ తన సినిమా నుండే కాపీ కొట్టాడని బాంబ్ పేల్చాడు.

ఆయన ప్రధానంగా సినిమా మేకింగ్ స్టైల్, నటీనటుల ప్రదర్శన మరియు కమర్షియల్ ఫార్మాట్‌పై అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దర్శకుడిగా తనకున్న సుదీర్ఘ అనుభవంతో, ఈ చిత్రం సాధారణ ప్రేక్షకుడికి ఏ మేరకు కనెక్ట్ అవుతుందనే కోణంలో విశ్లేషించారు.

నా సినిమా నుండే కాపీ 

Advertisement

‘పెద్ది’ సినిమా ఒక కమర్షియల్ బయోపిక్‌గా కంటే ఒక డాక్యుమెంటరీ తరహాలోనే ఎక్కువగా సాగింది. ఒక పల్లెటూరు నేపథ్యం, అక్కడ కూలి పనుల కోసం కష్టపడే ఒక వ్యక్తి జీవితం, ఆపై జరిగే డ్రామా సినిమాకు మూల కథగా నిలిచాయి. అయితే, కథనంలో స్పష్టమైన ఫార్మాట్ లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారిందని ఆయన పేర్కొన్నారు. యువ దర్శకులు ఎన్నో ఆశలతో, మల్టీటాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్స్‌గా నిరూపించుకోవాలనే తపనతో ఇలాంటి వైవిధ్యమైన ప్రయత్నాలు చేయడం మంచి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్సే అయినప్పటికీ, కమర్షియల్ బాక్సాఫీస్ వద్ద అది వర్కవుట్ అవ్వడం అంత సులువు కాదని తేల్చి చెప్పారు.ఇక సినిమాలో హీరోయిన్ తనకు తానుగా తాళి కట్టుకునే సీన్ తన తన క్లాసిక్ హిట్ ‘కోకిల’ (1989) సినిమాలో నుండి   డైరెక్టర్ బుచ్చిబాబు  కాపీ కాపీ కొట్టినట్టు కనిపిస్తుందని అసలు విషయం చెప్పుకొచ్చాడు.

ఇక సినిమాలోని నటీనటుల ఎంపిక, ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ   క్యారెక్టరైజేషన్ గురించి ఆయన ప్రస్తావించారు. సినిమాలో ఆమె పాత్ర కోసం పడిన కష్టం కనిపించినప్పటికీ, ఆ గ్రూమింగ్ ఇంకా పర్ఫెక్ట్‌గా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. షూటింగ్ సమయంలోనే తనను సంప్రదించి ఉంటే, ఆ పాత్రను మరింత బాగా ఎలివేట్ చేయడానికి సరైన గైడెన్స్ ఇచ్చేవాడినని, అయితే అందుకు తాను ఇతరుల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఛార్జ్ చేసేవాడినని చెప్పుకొచ్చారు.

యానిమల్ ప్రభావం – పంచ్ సీన్లు

Advertisement

ఈ చిత్రంలోని కొన్ని సీన్స్  గురించి మాట్లాడుతూ, ఇటీవల వచ్చిన ‘యానిమల్’ సినిమాలోని వైల్డ్, క్రిమినల్ మైండ్‌సెట్ మరియు విపరీతమైన హింస (బీటింగ్ అప్ సీన్స్) వంటి ఎలిమెంట్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని, ఇందులో బలవంతంగా ఇరికించినట్లు అనిపించిందని గీతాకృష్ణ విమర్శించారు. ఒక సినిమా చేస్తున్నప్పుడు మొదటి నుండి చివరి వరకు ఒకే ఫార్మాట్‌ను నమ్ముకుని వెళ్లాలి తప్ప, మార్కెట్ ట్రెండ్ కోసం అన్ని రకాల జోనర్లను కలిపి వండితే కథ పక్కదారి పడుతుందని హెచ్చరించారు. సినిమాలో డౌట్స్ క్లియర్ చేయడానికి సెకండాఫ్‌లో పెట్టిన కొన్ని సుదీర్ఘమైన సీన్లు ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షగా నిలిచాయని, ఆ ముప్పై నిమిషాల ఎపిసోడ్స్ నిడివిని తగ్గించి ఉంటే బాగుండేదని డైరెక్టర్‌కు స్వయంగా సూచించినట్లు ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఎలాంటి కౌంటర్లు పడతాయో !

తెలుగు సినిమా చరిత్రలో చూస్తే బయోపిక్‌లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే ప్రేక్షకులు ఎక్కువగా హీరో ప్రయాణం, భావోద్వేగాలు, విజయాలు, పరాజయాలు, క్లైమాక్స్ విజయగాథ వంటి అంశాలను ఆశిస్తారు. కానీ పెద్ది మాత్రం ఆ ఫార్ములాకు కాస్త భిన్నంగా వెళ్లిందనే  తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు గీతా కృష్ణ. చూడాలి మరి గీతా కృష్ణ వదిలిన ఈ కామెంట్స్ పై ఎలాంటి కౌంటర్లు పడతాయో !

Related News

డింపుల్ హయతి నెలకు అంత సంపాదిస్తుందా..? సినిమాల కన్నా ఎక్కువే..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

కోమల్ నుదుటిపై సింధూరం.. గోవిందా సీక్రెట్ మ్యారేజ్ నిజమేనా?

నాని ‘ది ప్యారడైజ్’కి చిరంజీవి సపోర్ట్.. మెగా స్టార్ పోస్ట్ వైరల్

అక్కినేని కోడలు క్రేజ్ మాములుగా లేదుగా… ఏకంగా

Big Stories

Advertisement
×