BigTV English

RCB Fan Arrest : కోహ్లీ ఫ్యాన్స్ రచ్చ… మేక బలి.. ముగ్గురు ఫ్యాన్స్ అరెస్ట్

RCB Fan Arrest : కోహ్లీ ఫ్యాన్స్ రచ్చ… మేక బలి.. ముగ్గురు ఫ్యాన్స్ అరెస్ట్

 RCB Fan Arrest:  ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ (RCB) జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఇవాళ జరిగే మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తే.. అది టాప్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ సారి ఆర్సీబీ అభిమానులు నానా హంగామా చేస్తున్నారు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. చెన్నై ప్లే ఆప్స్ కి వెళ్లలేదని.. కొందరూ ట్రోలింగ్స్ చేస్తుంటే మరికొందరూ చెన్నై కెప్టెన్ ధోనీ జెర్సీని చించివేయడం ఇలా రకరకాలుగా చేశారు. మరోవైపు ఓ థియేటర్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు గొడవ పడిన ఘటనలు కూడా ఉన్నాయి.


Also Read : Ads In IPL : ఒక్క యాడ్ కు ఇన్ని లక్షలా… ఈ లెక్కలు తెలిస్తే జనాలు పిచ్చోళ్ళు రావడం పక్కా !

తాజాగా ఆర్సీబీ ప్లే ఆప్స్ కి చేరుకోవడంతో సంబురాలు జరుపుకున్నారు ఆర్సీబీ అభిమానులు. కర్ణాటకలో  విరాట్ కోహ్లీ ఫ్లెక్సీ ముందు ఓ మేకను బలి ఇచ్చారు. దీంతో ముగ్గురు ఆర్సీబీ అభిమానులను అరెస్ట్ చేశారు పోలీసులు. దాదాపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకోవడంతో మేకను బలి ఇచ్చారట. అయితే ఈ సీజన్ లో ఏ టీమ్ అభిమానులు కూడా ఇంత హంగామా చేయలేదు. ఇక ముంబై అభిమానులు మాత్రం ఫైనల్ లో ముంబై వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగితే.. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోతే అప్పుడు మజా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో నిత్యం వివాదాలు కారణం అవుతుంది ఆర్సీబీ జట్టు. అసలు కప్ కొట్టకుంటేనే ఇలా ఉంటే.. కప్ కొడితే ఇంకెలా ఉంటుందోనని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 11 మ్యాచ్ లు ఆడి వాటిలో 8 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. కేవలం 3 మ్యాచ్ ల్లోనే ఓడిపోయింది. దీంతో 16 పాయింట్లతో టాప్ స్థానంలో కొనసాగుతుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం 11 మ్యాచ్ లు ఆడి.. 2 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్ లో చెత్త ప్రదర్శన కనబరచడంతో ఆర్సీబీ అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ పై ఘోరంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవ లేదు.. కానీ ఆర్సీబీ అభిమానులు భలే రెచ్చిపోతున్నారని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఆర్సీబీ పై కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మొన్న ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ని మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సీజన్ లో ఆర్సీబీ అభిమానులు మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ అభిమానులు అంటే మినిమం ఉంటుంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలా వ్యవహరించి.. మేను బలి ఇవ్వడంతోనే ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఇంకా ముందు ముందు ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతాయో చూడాలి మరీ.

Related News

IND vs BAN: పసికూన బంగ్లాదేశ్ పై పంజా…ఆసియా కప్ ఫైనల్స్ కు టీమిండియా..ఇంటికి శ్రీలంక

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Big Stories

×