BigTV English

RCB VS CSK : ధోనికి ఘోర అవమానం..CSK జెర్సీ చింపేసిన RCB ఫ్యాన్

RCB VS CSK : ధోనికి ఘోర అవమానం..CSK జెర్సీ చింపేసిన RCB ఫ్యాన్

RCB VS CSK :  ఐపీఎల్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేము. ముఖ్యంగా ఈ మధ్య  చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ మూవీ రీ రీలీజ్ సందర్భంగా ఆర్సీబీ-చెన్నై అభిమానులు థియేటర్ లో కొట్టుకున్నారు. అలాగే ఓ  బుడ్డోడు ఆర్సీబీ అభిమాని.. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని ము**డ్డీతో తుడుచుకుంటూ కనిపించాడు. ఇవన్నీ సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్స్ జరిగాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీకి ఘోర అవమానం జరిగిందనే చెప్పాలి. ఎందుకు అంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ఉన్న ధోనీ జెర్సీ నెంబర్ 7ని ఓ అభిమాని ధరించాడు. అయితే  వెనుక వైపు నుంచి వచ్చిన ఆర్సీబీ ఫ్యాన్ ఆ జెర్సీనీ  చించేశాడు.


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి సంఘటనలు ఈ సీజన్ లో సీఎస్కే పై చాలానే జరుగుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 11 మ్యాచ్ లు ఆడితే వాటిలో కేవలం 2 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో ప్లే ఆప్స్ రేస్ నుంచి ఇక నిష్క్రమించింది అనే చెప్పాలి. ముఖ్యంగా ఆర్సీబీ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు మాత్రమే అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. మిగతా జట్లు అన్ని కాస్త వెనుకంజలో ఉన్నాయి. వాటిలో ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే ప్లే ఆప్స్ కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ జట్లు రెండు మ్యాచ్ లు ఆడితే రెండు సార్లు ఆర్సీబీనే విజయం సాధించింది. ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఆర్సీబీ రెండు సార్లు విజయం సాధించలేదు ఏ సీజన్ లో కూడా. వాస్తవానికి నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే చివరి ఓవర్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి 15 పరుగులు అవసరం.  ఐపీఎల్ మ్యాచ్ లో అది పెద్ద కష్టం ఏమి కాదు.. క్రీజులో రవీంద్ర జడేజా, ఫినిషర్ ఎం.ఎస్. ధోనీ ఉన్నారు. ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్ పై నమ్మకంతో ఆర్సీబీ కెప్టెన్ అతనికి బంతిని ఇచ్చాడు. అనుకున్నట్టుగానే కెప్టెన్ ధోనీని ఔట్ చేసి మరీ తన జట్టును గెలిపించాడు. కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో తాను హీరోగా మారిపోయాడు. గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆప్స్ కి క్వాలిఫై కాకుండా చేయడంతో యశ్ దే ప్రధాన పాత్ర. చివరి ఆరు బంతుల్లో 17 పరుగులు చేస్తే.. నాకౌట్ కి వెళ్లే ఛాన్స్ ఉండే. అప్పుడూ కూడా జడేజా, ధోనీనే క్రీజులో ఉన్నారు. మొదటి బంతికే సిక్స్ కొట్టినప్పటికీ.. తరువాత ధోనీని ఔట్ చేయడంతో పాటు చివరికీ 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆర్సీబీ ని ప్లే ఆప్స్ కి చేర్చి.. సీఎస్కేను ఇంటికి పంపించాడు యశ్ దయాల్.


Tags

Related News

Asia Cup 2025 : పాక్ చెత్త ఫీల్డింగ్.. మ‌రోసారి రుజువైంది..చేతులారా వ‌చ్చిన రనౌట్ వ‌దిలేశారుగా

India vs Pakistan final: టీమిండియా, పాక్ మ‌ధ్య ఫైన‌ల్స్‌… 41 ఏళ్లలో తొలిసారి…రికార్డులు ఇవే..ఫ్రీగా చూడాలంటే?

IND vs SL: నేడు శ్రీలంక‌తో మ్యాచ్‌…టీమిండియాకు మంచి ప్రాక్టీస్…బ‌లాబ‌లాలు ఇవే

Rohith Sharma : మ‌రోసారి 10 కిలోలు తగ్గిన రోహిత్ శ‌ర్మ‌…ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే

Asia Cup 2025 : బంగ్లా చిత్తు… ఫైనల్ కు పాకిస్తాన్.. టీమిండియాతో బిగ్ ఫైట్

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

PAK Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×