Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఐదు దశాబ్దాలుగా తెలుగు తెరపై తనదైన శైలిలో సినిమాలు చేస్తూ, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. తాజాగా ఆయనకు అత్యుత్తమ పురస్కారమైన పద్మభూషణ్ తో సత్కరించారు. ఈ పురస్కారం ఆయన కళ, రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన అసాధారణమైన కృషికి గుర్తింపుగా లభించింది. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనను సన్మానించడానికి ఒక ఘనమైన సన్మాన సభను హిందూపురంలో ఏర్పాటు చేశారు. అతిరథ మహారధులు, అభిమానులు, రాజకీయ నాయకులతో నిండైన సభ హిందూపురంలో కొలువైయుంది. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణను సన్మానించడానికి ఈ సభను ఏర్పాటు చేశారు.
నట సింహానికి ఘన సన్మానం ..
నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును ఏప్రిల్ 28న న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మా చేతుల మీదగా అందుకున్నారు. తాజాగా హిందూపురంలో ఆయనను సన్మానించడానికి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వేలాదిమంది అభిమానులు హాజరయ్యారు. హిందూపురంలో సన్మాన సభకు, నందమూరి బాలకృష్ణ ఆయన సతీమణితో సహా హాజరయ్యారు. అభిమానులు, టిడిపి నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం హిందూపురం ఎంపీ పార్థసారధి మాట్లాడుతూ.. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన బాలయ్య బాబు గారికి ఈరోజు పద్మభూషణ్ అవార్డు రావడంతో ఈ ప్రాంతమంతా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. మనందరికీ తెలుసు హిందూపురంలో తెలుగుదేశం పార్టీ కంచుకోట, ఆరోజు స్వర్గీయ ఎన్టీఆర్ పోటీ చేసిన, హిందూపూర్ లో ఆయన తనయుడు బాలకృష్ణ మూడుసార్లు హ్యాట్రిక్ విజయం సాధించడం చాలా గ్రేట్. ఆయన సినీ రంగం ఎన్నో హిట్లనో అందించారు. ముద్దుల మామయ్య నుంచి సింహ, అఖండ వరకు అన్ని సినిమాలు సూపర్ హిట్. హిందూపూర్ లో తాగునీటి సమస్య పరిష్కరించడానికి ఆయన ఎంతో కృషి చేశారు. హిందూపురంలో హాస్పటల్ ను డెవలప్మెంట్ చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. పద్మ విభూషణ్ తోపాటు భవిష్యత్తులో ఆయన ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
నిరాడంబరుడికి నిండైన సభ..
కదిరి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ మాట్లాడుతూ.. ఒక విశిష్టమైన వ్యక్తికి విశిష్టమైన అవార్డు రావడం నిజంగా చాలా గొప్ప. ఒక మనిషిలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి అంటే అది నిజంగా బాలయ్య బాబు కే సాధ్యం. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నటన కౌసల్యాన్ని తెలియచెప్తూ అద్భుతమైన నటనతో, నిరంతరం వారి తండ్రిని మర్చిపోకుండా అదే స్థాయిలో నటించడం వారి గొప్పతనం. వారి తల్లి పేరుతో బసవతారకం ట్రస్టును ఏర్పాటు చేసి నిరంతరం పేదలకు సేవలను చేస్తూ, హిందూపూర్ లో కూడా ప్రభుత్వ ఆస్తుపత్రిలో ఆయన చూపిస్తున్నటువంటి చొరవని చూసి, మేమందరం ఎంతో నేర్చుకుంటున్నాం. ప్రజాక్షేమం ఎప్పుడూ కోరుకునే నాయకుల్లో బాలకృష్ణ. ఈ అవార్డు ఆయనకు మాత్రమే రావడం కాదు, హిందూపురం ప్రజలకు మన తెలుగు వారందరికీ ఎంతో గౌరవంతో కూడిన అవార్డు అని ఆయన తెలిపారు. జై బాలయ్య అంటూ అభిమానుల ఉత్సాహాన్ని నింపారు.
తిప్పయ్య స్వామి మాట్లాడుతూ.. ఆయనకు అవార్డు రావడం చాలా సంతోషకరం. హిందూపురంలో నీటి సమస్యను తీర్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. పద్మ భూషణ్ తో పాటు మరెన్నో అవార్డులు భారతరత్న అవార్డు కూడా ఆయనకి రావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.