సముద్రాన్ని చూస్తే చాలా మంది భయం వేస్తుంది. ఎటు చూసినా అంతులేని నీటితో వెన్నులో సన్నని వణుకు పుట్టిస్తుంది. కానీ, అదే సముద్రాన్ని ఎంటర్ టైన్ మెంట్ కోసం ఉపయోగిస్తున్నాయి చాలా కంపెనీలు. కాక్ టెయిల్ పార్టీలు, పెళ్లిళ్లు, బర్త్ డేలు సహా పలు వేడుకలను సముద్రం మధ్యలో జరుపుకుంటున్నారు చాలా మంది. అద్భుతమైన ఇన్నోవేషన్స్, టెక్నాలజీ కారణంగా సముద్రం మీద ముషులను ఆధిపత్యం వహిస్తున్నారు. విహారయాత్రల కోసం అతిపెద్ద క్రూయిజ్ షిప్ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, టైటానిక్ లాంటి ఓడలే సముద్రంలో మునిగిపోయాయి. అలాంటిది ఇంత పెద్ద క్రూయిజ్ షిప్స్ ఎందుకు మునగట్లేదు? అంత సేఫ్ గా ఎలా ఉంటున్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
అత్యంత సురక్షితంగా క్రూయిజ్ షిప్ ల నిర్మాణం
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత పెద్ద క్రూయిజ్ షిప్స్ సముద్రంలో తలెత్తే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఈజీగా తట్టుకోగలవు. నిజానికి సముద్రంలో కండీషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. భయంకరమైన తుపానులు, అప్పుడప్పుడు ఎగసిపడే రాకాసి అలలు వచ్చి ఓడలను ఢీకొట్టే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ, క్రూయిజ్ షిప్ లు తలట్టుకొని నిలబడగలిగేలా తయారు చేస్తున్నారు.
ఎంటర్ టైన్ మెంట్ తో పాటు సేఫ్టీ ముఖ్యం!
మనం క్రూయిజ్ షిప్ లో టికెట్ కొంటున్నామంటే, వెకేషన్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే కాదు, మన సేఫ్టీని కూడా కొనుగోలు చేసినట్లే భావించాలి. ఒకనొక సమయంలో సముద్ర ప్రయాణం చేయాలంటే చాలా ధైర్యం అవసరమయ్యేది. ఎందుకంటే, ఈ రోజుల్లో మాదిరిగా అప్పట్లో సేఫ్టీ ఇంతగా లేదు. తుఫాన్లు వస్తే, ఈజీగా ఓడలు మునిగిపోయేవి. చివరకు టైటానిక్ లాంటి షిప్ కూడా సరైన భద్రతా ఫీచర్లు లేకపోవడం వల్ల మునిగిపోయింది. వేలాది మంది ప్రాణాలు పోయేందుకు కారణం అయ్యింది. కానీ, ఇప్పుడు ఉన్న క్రూయిజ్ షిప్ లు చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి లైట్ వెయిట్ మెటీరియల్ తో తయారవుతాయి. ఐకాన్ ఆఫ్ ది సీస్ షిప్ ఏకంగా 365 మీటర్లు ఉంటుంది. ఏకంగా 20 డెక్స్ ఉంటాయి. 7600 మంది ప్రయాణీకులు జర్నీ చేసే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, స్వింగ్ పూల్స్ సహా ఓ మినీ నగరంలా ఉంటుంది.
విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేలా డిజైన్
క్రూయిజ్ షిప్ డిజైన్ కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకునేలా ఉంటుంది. షిప్ పై భాగంలో ఉన్న భారీ నిర్మాణం నీటిని కిందికి నెడుతుంది. దానివల్ల షిప్ పైకి తేలుతుంది. ఈ ఫోర్స్ తుఫాన్ లాంటి సమయాల్లో షిప్ అలల పైనే తేలేలా ఉపయోగపడుతుంది. సైన్స్, ఇంజినీరింగ్ ను కలిగి ఈ క్రూయిజ్ షిప్ లను తయారు చేస్తారు. షిప్ కు సంబంధించినంత వరకు కీ ఎలిమెంట్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇది షిప్ మధ్యలో ఉండటం వల్ల బ్యాలెన్స్ ను మెయింటెన్ చేస్తుంది. షిప్ అడుగు భాగం పై భాగం కంటే బరువుగా ఉంటుంది. షిప్ స్టెబులిటీకి చాలా ముఖ్యం. షిప్ తయారీ సమయంలో దాని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ గా ఉండేలా చూసుకుంటారు. షిప్ కు ఉండే స్టెబులైజర్ పిన్స్ కారణంగా బోల్తా కొట్టకుండా సాయపడుతాయి. అంతేకాదు, షిప్ అడుగు భాగంలో నీటితో నింపిన బ్యాలెన్స్ ట్యాంక్ ఉంటుంది. ఇది షిప్ ను స్థిరంగా ఉంచేందుకు సాయపడుతాయి. బయట సముద్రం ఎంత గర్జించినా లోపల ఉన్న ప్రయాణీకులకు పెద్దగా తెలియదు. పాతకాలం షిప్స్ లో ఈ బ్యాలెన్స్ ట్యాంక్ లు లేకపోవడం వల్లే ఈజీగా ప్రమాదానికి గురయ్యేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అంతేకాదు, లేటెస్ట్ క్రూయిజ్ షిప్ లలో అత్యాధునిక జీపీఎస్, నేవిగేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. వీటి వల్ల అడ్డంకులను ముందుగానే గుర్తించి తగిన రక్షణ చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతాయి. మొత్తంగా ప్రస్తుతం ఉన్న క్రూయిజ్ షిప్ లు అత్యంత మెరుగైన భద్రతా ఫీచర్లను కలిగి ఉన్నాయి.
Read Also: తళతళ మెరిసిన వాషింగ్ పౌడర్ నిర్మా.. కారు చీకట్లు కమ్ముకుని ఎలా కనుమరుగైంది?