E-Paper
Advertisement

RCB VS MI: RCB అరాచకం..చివ‌రి ఓవ‌ర్ లో విజ‌యం..క‌న్నీళ్లు పెట్టుకున్న నీతా అంబానీ !

RCB VS MI:  RCB అరాచకం..చివ‌రి ఓవ‌ర్ లో విజ‌యం..క‌న్నీళ్లు పెట్టుకున్న నీతా అంబానీ !
Advertisement

RCB VS MI: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Womens Premier League 2026 ) నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రారంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల ( Mumbai Indians Women vs Royal Challengers Bengaluru Women) మధ్య ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో ఏకంగా మూడు వికెట్ల తేడాతో చివరి క్షణంలో విజయం సాధించింది బెంగళూరు. చివరలో నాడిన్ డి క్లర్క్ (Nadine de Klerk) అద్భుతంగా ఆడి మ్యాచ్ ను గెలిపించారు. దీంతో ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో బయటకు వచ్చింది. ఇది చూసిన బెంగళూరు అభిమానులు ఆమెను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మొదటి మ్యాచ్ కే ఏడిపించేసాం, ఇక ముందుంది ముస‌ళ్ల పండ‌గ అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

Also Read: Ind vs NZ ODI Series: గంభీర్ బౌలింగ్ లో చిత‌క‌బాదిన విరాట్ కోహ్లీ..న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్‌ షెడ్యూల్

ఆర్సీబీ దెబ్బ అదుర్స్‌

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో నిన్న మొట్టమొదటి మ్యాచ్ జరిగింది. రాయల్ చాలెంజెస్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించారు. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రానించి తొలి మ్యాచ్ లోనే విజయాన్ని నమోదు చేసుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. డిపెండింగ్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ను ఏకంగా మూడు వికెట్ల తేడాతో మట్టి కరిపించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. బ్యాటింగ్ అదే సమయంలో బౌలింగ్ రెండు విభాగాలు అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్టుకు పరాజయాన్ని చవిచూపించింది.

ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్స్ లో ఆరు వికెట్ నష్టపోయి 154 పరుగులు చేసింది. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ లో కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ తో పాటు మిగిలిన మరో నలుగురు , చాలా కష్టపడి 154 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ముందు ఉంచారు. అయితే ఆ లక్ష్యాన్ని చివరి దాకా ఆడిన బెంగళూరు, ఛేదించగలిగింది. 20 ఓవర్లు ఆడి 7 వికెట్లు నష్టపోయిన బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బెంగళూరుకు చెందిన నాడిన్ డి క్లర్క్ (Nadine de Klerk) 44 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

చివరి ఓవర్ లో బెంగళూరు విజయం

Advertisement

చివరి ఓవర్ లో నాలుగు బంతుల్లో 18 పరుగులు చేస్తేనే బెంగళూరు విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన నాడిన్ డి క్లర్క్ (Nadine de Klerk) వరుసగా 6,4,6,4 సాధించి మ్యాచ్ ను గెలిపించారు. ఈ దెబ్బకు నీతా అంబానీ కన్నీళ్లు పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×