BigTV English

Team India: తగ్గిన టీమిండియా గెలుపు శాతం…WTC ఫైనల్ రేస్ నుంచి ఔట్‌ ?

Team India: తగ్గిన టీమిండియా గెలుపు శాతం…WTC ఫైనల్ రేస్ నుంచి ఔట్‌ ?

Team India: టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ మధ్య బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ లో రోహిత్‌ సేనకు ఎదురు దెబ్బ తగిలింది. దీంతో.. టీమిండియా ( Team India ) ఢిపెన్స్‌ లోకి వెళ్లింది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కంటే.. ముందు న్యూజిలాండ్‌ ( New zealand) ఓడిపోవడం.. టీమిండియాకు కొత్త టెన్షన్‌ ను తెచ్చింది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ( World Test Championship) సర్కిల్ లో ఇంకా 10 సిరీస్ లో జరగనున్నాయి. టాప్ 2లో నిలిచే జట్లు ఏవి అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంటుంది. న్యూజిలాండ్ తో తొలి టెస్టులో ఓటమి తర్వాత భారత్ విన్నింగ్ పర్సంటేజ్ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పటివరకు ఇండియా 12 మ్యాచ్లు ఆడింది.


Reduced winning percentage of Team India Out of WTC final race

8 మ్యాచ్లలో విజయం సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్లలో ఓటమిపాలైంది. ఒక మ్యాచ్ డ్రా అయ్యింది. విన్నింగ్ పర్సంటేజ్ 68.06కి పడిపోయింది. న్యూజిలాండ్ తో టీమిండియా ఇంకా రెండు మ్యాచ్లు ఆడాలి. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులతో తలపడాలి. కివీస్ చేతిలో ఓటమి తర్వాత కూడా టీమ్ ఇండియా టాప్ ప్లేస్ లోనే ఉంది. న్యూజిలాండ్ పై మూడు టెస్టుల్లోను గెలిచి ఉంటే ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకునేది. కానీ ఇప్పుడు ఓటమితో ఈక్వేషన్ పూర్తిగా మారిపోయింది.

Also Read: Womens T20 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓటమి.. విశ్వ విజేతగా న్యూజిలాండ్.. చరిత్రలోనే తొలిసారి !


తర్వాత ఏడు మ్యాచ్లలో నాలుగు గెలిచి రెండు మ్యాచ్లు డ్రా చేసుకున్న టీమిండియా ( Team India ) ఫైనల్ కు చేరుతుందని ఎక్స్‌ పర్ట్స్‌ అంచనాలు వేస్తున్నారు. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఫైనల్ చేరుతుందని అంటున్నారు. అప్పుడు టీమిండియా విన్నింగ్ పర్సంటేజ్ 67.54 అవుతుంది. నాలుగు విజయాలు, రెండు డ్రాలతో భారత్ ఖాతాలో 56 పాయింట్లు చేరతాయి. సౌత్ ఆఫ్రికా తన చివరి ఆరు టెస్టులను గెలిస్తే విన్నింగ్ పర్సంటేజ్ 69.44% అవుతుంది. అయితే ఆసిస్ నాలుగు మ్యాచ్లు గెలిచి రెండు డ్రాలు చేసుకుంటే విన్నింగ్ పర్సంటేజ్ 64.04 అవుతుంది.

ఇండియా 56 పాయింట్లలోపే సాధిస్తే టాప్ 2 నుంచి ఎగ్జిట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎలాగంటే టీమ్ ఇండియా నాలుగు మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ డ్రా చేసుకుంటే 52 పాయింట్లు వస్తాయి. అప్పుడు భారత్ ను ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా దాటే అవకాశం ఉంటుంది. శ్రీలంక కూడా విన్నింగ్ పర్సంటేజ్ ను 67 కు పెంచుకునే అవకాశం ఉంటుంది. కానీ అది భారత్ కే అడ్వాంటేజ్ అవుతుంది. అలా జరిగితే టీం ఇండియా తర్వాత స్థానాలలో ఆసిస్, సౌత్ ఆఫ్రికా ఉంటాయి. కాబట్టి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌ కు ( World Test Championship) వెళ్లాలంటే.. టీమిండియా.. ఇక ముందు ఆడే న్యూజిలాండ్‌ తో రెండు టెస్టులు, ఆసీస్‌ తో ఆడే టెస్టుల్లో చాలా జాగ్రత్తగా ఆడాలి. మళ్లీ ఓడితే.. ఇంటికే అంటున్నారు.

Related News

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

Big Stories

×