BigTV English

Rishabh Pant – MLC : రిషబ్ పంత్ ఒక్క మ్యాచ్ కు 1.9 కోట్లు..MLC లీగ్ లో అందరూ ఆడిన కూడా అన్ని డబ్బులు రావు

Rishabh Pant – MLC : రిషబ్ పంత్ ఒక్క మ్యాచ్ కు 1.9 కోట్లు..MLC లీగ్ లో అందరూ ఆడిన కూడా అన్ని డబ్బులు రావు

Rishabh Pant – MLC : టీమిండియా కీలక ఆటగాడు రిషబ్ పంత్ 18వ ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సీజన్  ప్రారంభంలో రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన చేశాడు. చివరి రెండు మ్యాచ్ ల్లో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఇక చివరి మ్యాచ్ లో మాత్రం సెంచరీ సాధించాడు. అయినప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛేజింగ్ చేసి టాప్ 2లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. టాప్ 2నే కాదు.. ఏకంగా ఐపీఎల్ 2025 ట్రోఫీని కూడా దక్కించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే రిషబ్ పంత్ గురించి ఐపీఎల్ మ్యాచ్ సమయంలో కూడా ఓ వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ జట్టు యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రిషబ్ పంత్ మాత్రం ఒక్కో మ్యాచ్ కి రూ.1.9 కోట్లు తీసుకొని పేలవ ప్రదర్శన చేయడం విశేషం.


Also Read :  Watch Video : మన్కడింగ్ చేయకుండా రౌడీయిజం.. ఇదెక్కడి క్రికెట్ నాయనా

తాజాగా మేజర్ లీగ్ క్రికెట్ (MLC) జరుగుతోంది. ఇవాళే ప్రారంభం అయింది. మేజర్ లీగ్ క్రికెట్ జూన్ 12, 2025 నుంచి జూలై 14, 2025 వరకు జరుగుతోంది. ఐపీఎల్ తరువాత మరో యాక్షన్ ప్యాక్ట్ సీజన్ కి సిద్ధమవుతున్నందున మరోసారి ఉత్కంఠ పెరుగుతోంది. ఆరు జట్లు డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్ లో ఢీ కొంటాయి. లీగ్ దశ,  ప్లే ఆప్స్, ఫైనల్ అన్ని కలిపి దాదాపు నెల రోజుల పాటు జరుగుతోంది. ఇక ఈ టోర్నమెంట్ మొత్తం కేవలం మూడు ప్రధాన వేదికల్లోనే జరుగుతుంది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ కొలీజియం, టెక్స్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం, ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ స్టేడియంలో మ్యాచ్ లు జరుగుతాయి. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఐపీఎల్ లో రిషబ్ పంత్ ఒక్కడే ఒక్క మ్యాచ్ కు రూ.1.9కోట్లు తీసుకున్నాడు. కానీ MLC లీగ్ లో మాత్రం అందరూ ఆడినా కానీ అన్ని డబ్బులు రావు అని ఓ వార్త వైరల్ కావడం విశేషం. లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ కూడా ఇటీవల వైభవ్ సూర్యవంశీ ని కలిసి రిపబ్ పంత్ కంటే నువ్వే అద్భుతంగా ఆడుతున్నావని.. అతనికీ డబ్బులు వేస్ట్ అని కూడా చెప్పినట్టు వార్తలు వినిపించిన విషయం విధితమే.


ఐపీఎల్ లో రిషబ్ పంత్ కొన్ని ఇన్నింగ్స్ లో డకౌట్, సింగిల్ డిజిట్స్ కే పరిమితమయ్యాడు. చివర్లో మాత్రం పుంజుకున్నారు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు వచ్చే సీజన్ లో అసలు రిషబ్ పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కెప్టెన్ గా ఉంచుకుంటుందా..? లేక మరెవ్వరినైనా కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇస్తుందా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రిషబ్ పంత్ నే LSG కొనసాగిస్తుందని కొందరూ అంటుంటే.. మళ్లీ అంత అమౌంట్ చెల్లించడం వృధా అని కొందరూ పేర్కొనట్టు తెలుస్తోంది. మొత్తానికి ఐపీఎల్ తో పోల్చితే.. MLC లీగ్ లో ఆటగాళ్లకు ఇచ్చే అమౌంట్ చాలా తక్కువ అని స్పష్టంగా అర్థమవుతోంది. 

Related News

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Big Stories

×