Ahmedabad Plane Crash : అదృష్టం అంతే అతనిదే. లక్‌కు కేరాఫ్ అతనే. అంత పెద్ద దారుణమైన విమాన ప్రమాదం. ఫ్లైట్‌లో ఉన్న వాళ్లంతా చనిపోయారు. పీస్ పీస్ అయ్యారు. కానీ, ఒకే ఒక్క యువకుడు మాత్రం అసలేం జరగనట్టే క్షేమంగా బయటకు నడిచి వచ్చాడు. ఒంటిపై పెద్దగా గాయలు కూడా ఏమీ లేవు. బానే ఉన్నాడు.
ఎలా బతికిపోయాడంటే..
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి.. ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. విమానంలో 11-A సీటులో కూర్చున్న విశ్వాస్ రమేశ్ కుమార్ అనే వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలతో ఉన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత అతను నడచుకుంటూ వచ్చాడు. విమానం టేకాఫ్ అయిన 30 సెకన్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చిందని.. ఆ తర్వాత విమానం కూలిపోయిందని విశ్వాస్ చెప్పాడు. అదంతా క్షణాల్లోనే జరిగిపోయిందన్నాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి రమేశ్.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేసి దూకేశానని చెబుతున్నాడు.
స్పాట్‌లో పరిస్థితి ఎలా ఉందంటే..
తాను యుకే పౌరుడినని.. లండన్ లో 20 ఏళ్లుగా ఉంటున్నానని చెప్పాడు రమేశ్. కుటుంబాన్ని కలిసి వెళ్దామని ఇండియాకు వచ్చానని అన్నాడు. తాను లేచే సరికి తన చుట్టూ విమాన శకలాలు ఉన్నాయని.. తన తమ్ముడు కూడా అదే విమానంలో ఉన్నాడని.. కానీ అతను కనిపించడం లేదు.. వెతికిపెట్టండని రెస్క్యూ సిబ్బందిని కోరాడు.
ఇంకా ఆ షాక్‌లోనే..
ప్రమాదం తర్వాత విమానంలోని ఇంధనం మండి.. బిగ్ బ్లాస్ట్ సంభవించింది. ఆ మంటల ఎఫెక్ట్ కూడా బాధితుడిపై లేదు. అంటే, విమానం నేలను ఢీ కొట్టడానికి కొన్ని క్షణాలకు ముందే జంప్ చేశాడా? ఏ చెట్టు మీదనో పడి ఉంటాడా? అందుకే, అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేవా? అనే అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం అతను హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. ఆ షాక్ నుంచి తేరుకున్నాక అసలేం జరిగిందో, ఎలా బయటపడ్డాడో తెలియొచ్చు.
ఒకే ఒక్కడు.. ఏం లక్కురా బాబు నీది..
అసలు అదేమైనా మాములు ప్రమాదమా? 241 మంది చనిపోయిన దారుణ దుర్ఘటన. శరీర భాగాలు ముక్కలై పోయాయి. కాలి నామరూపాలు లేకుండా పోయాయి. పెద్ద బాంబు పేలినట్టే పేలింది ఆ విమానం. ఫ్లైట్ క్రాష్ కు అసలు కారణమేంటో ఇంకా తెలీక పోయినా.. జరిగింది మాత్రం ఘోర విషాదం. అలాంటి ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు బతికాడంటే.. అతనిది అదృష్టం అనాలా? మిరాకిల్ అనాలా? ఇంకేదైనానా? తీవ్ర గాయాలు కూడా కాలేదు అతనికి. జస్ట్ ఏ బైక్ నుంచో జారి పడ్డట్టు.. చాలా సాదాసీదాగా నడుచుకుంటూ రావడం నిజంగా ఆశ్చర్యకరం. నమ్మశక్యం కాని నిజం. అతను ఫిజికల్‌గా బానే ఉన్నాడు. కాకపోతే ప్రమాదం జరిగిన షాక్‌లో ఉన్నాడు. అదే విమానంలో తనతో పాటు తన సోదరుడు కూడా ఉన్నాడని చెబుతున్నాడు. కానీ, అతని ఆచూకీ మాత్రం తెలీటం లేదు. ప్రమాదం స్పాట్‌లో చాలా మంది శరీర భాగాలు పడి ఉండటం చూశానని చెబుతున్నాడు. అంత పెద్ద ప్రమాదంలో మృత్యుంజయుడిగా బతికి బయటపడిన విశ్వాస్ రమేశ్ కుమార్ ఉదంతం అద్భుతమే.
Miraculously survived the #PlaneCrash — Vishwas Ramesh, who was seated on 11A, walked away from the wreckage alive.
A story of fate, faith, and a second chance at life. 🙏✈️ #Survivor #Miracle#planecrash pic.twitter.com/FLDnHemRJM
— Abhishek Acharya Kulshrestha (@iAbhiAcharya) June 12, 2025
#अहमदाबाद विमान हादसे का एक और नया वीडियो सामने आया है। देखकर रौंगटे खड़े हो जाएंगे, देखिए टेक ऑफ करते ही कैसे क्रैश हो गया#planecrash #Ahmedabad #AhmedabadPlaneCrash pic.twitter.com/y0WHJpM121
— Amit Singh (@amit3_singh) June 12, 2025