Tirupati New Train: తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక ప్రజలు కూడా ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటారు. ముఖ్యంగా చిక్ మంగళూరు, తుమకూరు, బెంగళూరు ప్రాంతాలవారు తిరుపతి వెళ్లాలంటే పెద్ద తిప్పలు పడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ సమస్యకు పక్కా పరిష్కారం వచ్చేసింది. తాజాగా కేంద్ర రైల్వే శాఖ తిరుపతి – చిక్ మంగళూరు మధ్య కొత్త వారం వారం ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇది ప్రయాణికులకు, భక్తులకు నిజంగా ఊరట కలిగించే సమాచారం.
ఈ రైలు గురువారం రోజున తిరుపతి నుండి బయలుదేరి, శుక్రవారం రోజున చిక్ మంగళూరు నుండి తిరిగి వస్తుంది. అధికారికంగా రైలు నంబర్లు 17423/17424 గా నిర్ణయించారు. ప్రస్తుతం ప్రారంభ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. మొదటివిడతగా ఈ రైలు వారానికి ఒకసారి నడవనుంది. తర్వాత ప్రజల స్పందనను బట్టి వారంలో మూడు సార్లు నడిపే అవకాశముందంటూ అధికారికంగా తెలిపింది.
ఈ రైలు ఓ ప్రత్యేకతేంటంటే.. ఇది బెంగళూరు మీదుగా ప్రయాణిస్తుంది. అంటే కర్ణాటక ప్రజలకు ఇది బహు ఉపయోగకరంగా మారనుంది. తిరుపతి వెళ్లాలంటే ఇప్పటివరకు బెంగళూరు వరకు వేరే రైలు, అక్కడ నుంచి మరో ట్రైన్ లేదా బస్సు.. ఇలా మారుమార్గాల్లో ప్రయాణించాల్సి వచ్చేది. ఇకపై ఒక్క రైలులోనే, మరింత సౌకర్యంగా, టైమ్ వేస్ట్ లేకుండా తిరుపతి చేరుకోవచ్చు.
ఈ రైలు ప్రయాణించే మార్గంలో పలు ముఖ్యమైన స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పక్కాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్పేట, కుప్పం, బంగారపేట, వైట్‌ఫీల్డ్, కృష్ణరాజపురం, బెనగాలూరు SMVB, తుమకూరు, తిప్తూరు, ఆరసికెరె, దేవనూరు, బిరూరు, కదూర్, బిసలెహళ్లి, శఖరాయపట్న అనే స్టేషన్లు ప్రధానమైనవి. అంటే కర్ణాటక, ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలన్నీ ఈ రైలులో కవర్ అవుతాయి.
ఈ రైలును ప్రారంభించడంపై చిక్ మంగళూరు ఎంపీ కోట శ్రీనివాస్ పూజారి హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి వరకు రైలు నడిపించాలన్నది నా కల, అది నెరవేరినందుకు ఆనందంగా ఉంది. ఇది కేవలం నా కాదే, నా నియోజకవర్గ ప్రజల కల కూడా. ఈ కలను నెరవేర్చడంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి సోమన్నలకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ చెప్పారు. భవిష్యత్తులో ఈ రైలును వారానికి మూడుసార్లు నడిపేలా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశారు.
తిరుపతి అంటే కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు.. అది కోటి మందికి ఆధ్యాత్మిక కేంద్రం. రోజూ లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. చిక్ మంగళూరు, తుమకూరు, హసన్, షిమొగా ప్రాంతాలవారు తిరుపతి వెళ్లాలంటే ఇప్పటివరకు బెంగళూరులో బస చేయడం, మారే రైలు ఎక్కడం వంటి కష్టాలు తప్పవు. కానీ ఈ కొత్త రైలు ప్రారంభమవడం వల్ల ఇక అటువంటి అవాంతరాలు ఉండవు. ఇది డైరెక్టుగా, మార్గమధ్యంలో పలు ముఖ్యమైన స్టేషన్ల మీదుగా వెళ్తుంది. ఇది గ్రామీణ ప్రయాణికులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read: Railway reservation changes: ఇండియన్ రైల్వే బిగ్ అప్డేట్.. ఇక నో టెన్షన్.. చార్ట్ టైమ్ మారిందోచ్!
ఇందులో ఓ ప్రత్యేక అంశం ఏమిటంటే, ఈ రైలులో చిత్తూరు జిల్లాలోని పక్కాల స్టేషన్‌కు స్టాప్ ఇవ్వడం. ఇది చిన్న స్టేషన్ అయినప్పటికీ తిరుపతి వెళ్ళే బస్సు, వాహనాలు ఎక్కువగా ఉండే ప్రాంతం. అలాగే కుప్పం, బంగారపేట వంటి ప్రాంతాల్లోని విద్యార్థులు, ఉద్యోగులు కూడా బెంగళూరు వెళ్ళే దారిగా ఈ రైలును ఉపయోగించవచ్చు.
ఈ రైలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాక, ప్రయాణికులు IRCTC వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంకా షెడ్యూల్, టైమింగ్స్ రిలీజ్ కాలేదు కానీ రైల్వే శాఖ అది త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. టికెట్ ధరలు కూడా సాధారణ ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా నిర్ణయించనున్నారు.
ఒక్కసారి ఈ రైలు నడక ప్రారంభమైన తర్వాత ప్రయాణీకుల స్పందన బాగా ఉంటే, ఇది కేవలం వారానికి ఒక్కసారి కాదు, వారంలో మూడుసార్లు లేదా రోజూ నడిపే అవకాశం కూడా ఉంది. ఇది కేవలం భక్తులకు కాకుండా, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు కూడా అమూల్యమైన రైలు మార్గంగా నిలవనుంది.
చిక్ మంగళూరు – తిరుపతి మధ్య రైలు ప్రారంభం కేవలం ఒక నూతన రైలు ప్రయాణమే కాదు, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సంబంధాలను, ఆధ్యాత్మిక తత్వాన్ని కలుపుతున్న ఓ బంధంగా మారబోతోంది. బెంగుళూరు మీదుగా కలుపుతూ ప్రయాణికులకు గమ్యస్థానాలు చేరుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ఇది నిజంగా రైల్వే శాఖ నుంచి వచ్చిన ఒక మంచి నిర్ణయం.