
Rishabh Pant:- రిషబ్ పంత్ కేవలం ఆసియా కప్, వరల్డ్ కప్‌కు మాత్రమే దూరం అవుతాడని అనుకున్నాం. కాని, లేటెస్ట్ రిపోర్ట్స్ ఏంటంటే.. రిషబ్ పూర్తిస్థాయిలో రికవర్ అవడానికే కనీసం ఏడెనిమిది నెలలు పడుతుందంటున్నారు. ఇప్పుడు కోలుకుంటున్న తీరు చూసి, ఓ అంచనా వేసి చెప్పిన సమయం ఇది. నిజానికి అంతకంటే ఎక్కువ సమయమే పట్టొచ్చని చెబుతున్నారు. మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోసం అరుణ్ జైట్లీ స్టేడియం వచ్చాడు రిషబ్ పంత్. సపోర్ట్ లేకుండా నడవలేకపోతున్నాడు. ఏ సపోర్ట్ లేకుండా సొంతంగా నడవడానికే రిషబ్ పంత్ కు కొన్ని వారాలు పడుతుందని చెబుతున్నారు. ఈ లెక్కన బ్యాట్ పట్టాలంటే ఏడాది కాలం పడుతుందని అంచనా వేస్తున్నారు.
రిషబ్ పంత్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ బోలెడు ఆశలు పెట్టుకుంది. టెస్టు మ్యాచుల్లో సైతం టీ20 మోడల్‌లో ఆడే రిషబ్ పంత్.. ఇక ఐపీఎల్ టీ20లో ఎలా ఆడతాడో చెప్పక్కర్లేదు. పైగా సూర్యకుమార్ యాదవ్ నుంచి పోటీ ఎక్కువగా ఉంది. వన్డే, టీ20ల్లో సూర్యకుమార్ ను కాదని అవకాశాలు ఇవ్వాలంటే పంత్ తన సత్తా చూపించాల్సి ఉంది. కాని, ఇంతలోనే ఘోర ప్రమాదం జరిగింది. ఇప్పటికే, పంత్ ప్లేస్‌లో కొత్త వికెట్ కీపర్‌ను చూస్తున్నారు. ఆల్రడీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌కు విశాఖ కుర్రాకు కె.ఎస్. భరత్‌కు ఛాన్స్ కూడా ఇచ్చారు. ఆల్రడీ కె.ఎల్. రాహుల్, వృద్ధిమాన్ సాహా పోటీలోనే ఉన్నారు. ఇలాంటి కీలక సమయంలో యాక్సిడెంట్ అవడం, క్రికెట్‌కు ఏడాది పాటు దూరంగా ఉండాల్సి రావడం రిషబ్ పంత్ కెరీర్‌కు పెద్ద దెబ్బే.
న్యూఇయర్ వేడుకల్లో పాల్గొని వెళ్తున్న రిషబ్ పంత్ కారుకు యాక్సిడెంట్ అయింది. కారుకు తగిలిన డ్యామేజ్, రిషబ్ పంత్ పరిస్థితి చూసి… ఇక లైఫ్‌లో క్రికెట్ ఆడతాడా అనే డౌట్ వచ్చింది అందరికి. కాని, నాలుగు నెలల్లోనే హాస్పిటల్ బెడ్ నుంచి లేచాడు, క్రికెట్ స్టేడియానికి కూడా వచ్చాడు. ప్రస్తుతానికైతే స్పీడీ రికవరీనే అని చెప్పాలి. అదృష్టం బాగుండి… ఇలాగే రికవరీ అయితే… కనీసం వచ్చే ఏడాదిలోనైనా బ్యాట్ పట్టే అవకాశం ఉంటుంది.
రిషబ్ పంత్ కోలుకునేందుకు బీసీసీఐ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. స్పెషల్ ట్రీట్ మెంట్ అందిస్తోంది. కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్, ముంబైలోని మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్ల పర్యవేక్షణలో రిషబ్ పంత్‌కు వైద్యం అందుతోంది. త్వరలోనే మరో సర్జరీ కూడా చేయాల్సి ఉంటుందని బీసీసీఐ చెబుతోంది. ఇప్పటికే, లిగ్మెంట్ సర్జరీ సక్సెస్ ఫుల్‌గా జరిగింది.