
OTT : సమ్మర సీజన్ లో ఒకవైపు థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. మరోవైపు ఇటీవల విడుదలైన పలు సినిమాలు ఈ వారం ఓటీటీల్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో విడుదలకు సిద్ధమయ్యాయి. ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని జోనర్ల మూవీలు, వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉంటున్నాయి.
దసరా..
నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన మాస్ యాక్షన్ పీరియాడిక్ డ్రామా ‘దసరా’ మూవీ థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన దసరా నాని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది.
వ్యవస్థ..
‘జీ 5′ ఓటీటీ వేదిక కొత్త వెబ్‌సిరీస్ ‘వ్యవస్థ’ను ఏప్రిల్ 28 నుంచి అందుబాటులోకి తీసుకొస్తుంది. న్యాయ వ్యవస్థ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్‌ను ఆనంద్ రంగ తెరక్కెకించాడు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘నారప్ప’ సినిమాలతో గుర్తింపు పొందిన కార్తీక్ రత్నం, హెబ్బా పటేల్, సంపత్‌రాజ్ ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు.
సిటాడెల్ ..
వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను ఎంతోగానో అలరిస్తున్నాయి. ఓటీటీ సంస్థలు ప్రాంతీయ భాషల్లో అనువాదం చేసి సరికొత్త వెబ్‌సిరీస్‌లను అందిస్తున్నాయి. ఇప్పుడు భారతీయ ప్రేక్షకుల కోసం సిద్ధమైన స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘సిటాడెల్’. ఇందులో రిచర్డ్ మ్యాడన్ , ప్రియాంక చోప్రా , జోన్స్, స్టాన్లీ టక్కీ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా తొలి రెండు ఎపిసోడ్‌లను స్ట్రీమింగ్ చేయనున్నారు. మే నుంచి ప్రతి వారం ఒక్కో ఎపిసోడ్ విడుదల కానుంది. 300 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో ఈ సిరీస్‌ను నిర్మించారు రూసో బ్రదర్స్, అమెజాన్ స్టూడియోస్. డేవిడ్ వెయిల్ సిటాడెల్ కు దర్శకత్వం వహించారు. ఇండియన్ వెర్షన్‌లో వరుణ్ ధావన్, సమంత నటించారు.
ఓటీటీలో అలరించే సినిమాలు/ వెబ్‌సిరీస్‌లు..
డిస్నీ+హాట్‌స్టార్
సేవ్ ది టైగర్స్ (తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 27
పీటర్ పాన్ అండ్ వెండీ (హాలీవుడ్)- ఏప్రిల్ 28
జీ5..
యూటర్న్ (హిందీ)- ఏప్రిల్ 28
బుక్ మై షో..
స్క్రీమ్ 6 (హాలీవుడ్)- ఏప్రిల్ 26
అమెజాన్ ప్రైమ్..
పత్తు తల (తమిళ మూవీ)- ఏప్రిల్ 27
సోనీలివ్..
తురముఖమ్ (మలయాళ మూవీ) ఏప్రిల్ 28
నెట్‌ఫ్లిక్స్..
కోర్ట్ లేడీ (హిందీ వెబ్‌సిరీస్)- ఏప్రిల్ 26
నోవోల్యాండ్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 26
ది గుడ్ బ్యాడ్ మదర్ (వెబ్ సిరీస్)-ఏప్రిల్ 27
ది నర్స్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 27
స్వీట్ టూత్ సీజన్-2 (వెబ్ సిరీస్)-ఏప్రిల్ 27
ఎకా (హాలీవుడ్)- ఏప్రిల్ 28
బిఫోర్ లైఫ్ ఆఫ్టర్‌డెత్ (హాలీవుడ్ )-ఏప్రిల్ 28
Dharani: ధరణికి బీజేపీ సపోర్ట్!.. కాంగ్రెస్‌పై బండి మైండ్ గేమ్..