E-Paper
Advertisement

ఓవెన్ లేకుండానే మెత్తని తందూరీ కుల్చా రోటీ.. ఇంట్లోనే పాన్‌తో సులభంగా ఇలా తయారు చేయండి

ఓవెన్ లేకుండానే మెత్తని తందూరీ కుల్చా రోటీ.. ఇంట్లోనే పాన్‌తో సులభంగా ఇలా తయారు చేయండి
Advertisement

వేడి వేడి తందూరీ రోటీ లేదా కుల్చాలతో మంచి వెజ్ లేదా నాన్ వెజ్ కర్రీ కలిపి తింటే ఆ రుచి సూపర్‌గా ఉంటుంది. అందరూ ఇంట్లో రుచికరమైన కర్రీస్ తయారు చేసుకుంటారు. కానీ తందూరీ రోటీ లేదా కుల్చాలు చేయడం కష్టం. ఎందుకంటే వాటిని తయారు చేయడానాకి తందూర్ లేదా ఓవెన్ అవసరమని భావిస్తారు. అయితే ఈ రెస్టారెంట్ స్టైల్‌ రోటీలు తందూర్ లేకుండా కూడా తయారు చేయొచ్చు. సాధారణంగా ఇంట్లో ఉండే తవా (పాన్‌)తోనే మెత్తగా, రుచిగా ఉండే కుల్చాలను సులభంగా తయారు చేసుకోవచ్చు.

మెత్తని కుల్చాలకు సరైన పిండి తయారు చేయడం చాలా ముఖ్యం

కుల్చాలు బాగా రావడానికి వాటిని వండే విధానం కంటే పిండిని సరైన విధంగా సిద్ధం చేయడం చాలా ముఖ్యం. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పెరుగు కలిపిన పిండి కుల్చాలను మెత్తగా, పొంగిపోయేలా చేస్తుంది. పిండిని బాగా కలిపిన తరువాత కొంతసేపు విశ్రాంతి ఇవ్వడం వల్ల మంచి టెక్స్చర్ వస్తుంది.

కుల్చా పిండికి అవసరమైన పదార్థాలు ఇవే

Advertisement

రెండు కప్పుల మైదా, ఒక టీస్పూన్ ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్ల కరిగించిన వెన్న, ఒక టీస్పూన్ బేకింగ్ పౌడర్, ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు, అవసరమైనంత నీరు తీసుకోవాలి.

ఆలుగడ్డ స్టఫింగ్ కోసం కావలసిన పదార్థాలు

ఒక కప్పు ఉడికించి మెత్తగా చేసిన ఆలుగడ్డ, రెండు టీస్పూన్ల సన్నగా తరిగిన పచ్చిమిర్చి, రెండు టీస్పూన్ల అల్లం ముక్కలు, ఒక టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు, అర టీస్పూన్ కారం తీసుకోవాలి.

కుల్చాలకు మరింత రుచిగా ఇవి ఉపయోగించండి

Advertisement

కొద్దిగా కలొంజి గింజలు, కొత్తిమీర తరుగు, మెంతికూర ఆకులు, వెన్న సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవి కుల్చాలకు మంచి రుచి, సువాసన ఇస్తాయి.

ముందుగా పిండిని సిద్ధం చేయాలి

ఒక పెద్ద పాత్రలో మైదా, ఉప్పు, పెరుగు, వెన్న, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. తరువాత కొద్దికొద్దిగా నీరు పోస్తూ మెత్తగా పిండిని కలపాలి. ఆ పిండిని మూతపెట్టి ఒక గంటపాటు పక్కన ఉంచాలి. దీంతో పిండి మరింత మెత్తగా మారుతుంది.

తరువాత స్టఫింగ్ తయారు చేసుకోవాలి

ఆలుగడ్డ ముద్దలో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి.

కుల్చాలను తయారు చేసే విధానం చాలా సులభం

పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటిని చిన్న చపాతీలా ఒత్తి మధ్యలో ఆలుగడ్డ మిశ్రమం పెట్టాలి. అంచులను మూసి మళ్లీ మెల్లగా ఒత్తాలి. పైభాగంలో కలొంజి గింజలు, కొత్తిమీర, మెంతికూర ఆకులు చల్లాలి.

Also Read: రోగనిరోధక శక్తిని పెంచే నేరేడు షర్బత్.. రుచికరంగా కాలా జామున్ డ్రింక్ ఇలా చేయండి

పాన్‌పై కుల్చాలను కాల్చితే అద్భుతమైన రుచి

మీడయం ఫ్లేమ్‌పై పాన్ వేడి చేయాలి. కుల్చా ఒక వైపున కొద్దిగా నీరు రాసి ఆ భాగాన్ని పాన్‌పై ఉంచాలి. మూత పెట్టి కొద్దిసేపు కాల్చాలి. గోల్డెన్ కలర్ మచ్చలు కనిపించిన తర్వాత మరో వైపు తిప్పి పూర్తిగా కాల్చాలి. బయట కొద్దిగా క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే కుల్చాలు సిద్ధమవుతాయి.

వేడి వేడి కుల్చాలను వెన్నతో వడ్డిస్తే రుచి మరింత పెరుగుతుంది

తాజాగా తయారైన కుల్చాలపై నేయి లేదా వెన్న రాసి వేడి వేడి చోలేతో వడ్డించాలి. ప్రత్యేకమైన ఓవెన్ లేదా తందూర్ లేకుండానే ఇంట్లోనే రుచికరమైన కుల్చాలను తయారు చేసుకుని కుటుంబంతా కలిసి ఆస్వాదించండి.

Related News

కిచెన్‌లో ఈ చిన్న తప్పులే.. నెలాఖరుకి పర్సు ఖాళీ చేస్తాయి!

వర్షాల్లో పిల్లలను స్కూల్‌కు పంపుతున్నారా?.. ఈ జాగ్రత్తలు అస్సలు మర్చిపోవద్దు!

ఫోన్‌లో సీక్రెట్లు ఉంటేనే గొడవలు.. భార్యాభర్తలు ఇది తెలుసుకోవాలి!

మీ గర్ల్‌ఫ్రెండ్ ఇగోతో విసిగిపోయారా.. ఈ 5 ట్రిక్స్‌తో మీ మన:శాంతి కాపాడుకోండి

లేడీ లక్.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను భర్త ఎంతో గారబంగా చూసుకుంటారు

రాత్రి హైవేపై డ్రైవింగ్ చేసేటప్పుడు హై బీమ్ లైట్లతో ఇబ్బందిపడున్నారా? సురక్షితంగా డ్రైవ్ చేసేందుకు టిప్స్

ధృడమైన చేతులు, భుజాలు కావాలా? అప్పర్ బాడీ బలం పెంచుకోవడానికి ఈజీ డంబెల్ వ్యాయామాలు

భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతున్న ఆఫీస్ ఫ్రెండ్‌షిప్?

Big Stories

Advertisement
×