E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Sanjay Manjrekar: వైభ‌వ్ ను చూస్తే వ‌ణుకుపుడుతోంది..లంక ప్లేయ‌ర్లకు న‌ర‌కం చూపించాడు

Sanjay Manjrekar: వైభ‌వ్ ను చూస్తే వ‌ణుకుపుడుతోంది..లంక ప్లేయ‌ర్లకు న‌ర‌కం చూపించాడు
Advertisement

Sanjay Manjrekar:  ట్రై సిరీస్ ఫైనల్స్ లో (Tri Nation A Series in Sri Lanka 2026 ) భాగంగా టీమిండియా, శ్రీలంక జట్లు (Sri Lanka A vs India A, Final) తలపడ్డాయి. దంబుల్లా (Rangiri Dambulla International Stadium, Dambulla) వేదికగా ఈ రెండు జట్లు తలపడగా… టీమిండియా విక్టరీ సాధించింది. శ్రీలంకపై ఏకంగా 66 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది టీమిండియా లిస్టు ఏ టీమ్. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేయగా, వైభవ్ సూర్య వంశీ (Vaibhav Sooryavanshi ) 29 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. దీంతో శ్రీలంక ప్లేయర్లపై వైభవ్ సూర్య వంశీ ప్రతీకారం తీర్చుకున్నాడని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. అంతేకాదు మొన్న గొడవ జరిగినప్పుడు వైభవ్ ను తిట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. ఈ లిస్టులో సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) కూడా ఉన్నారు. మొన్న శ్రీలంక ప్లేయర్లతో గొడవ పడ్డ వైభవ్ ను జట్టు నుంచి మెడలు పట్టుకొని బయటకు గెంటేయాల‌ని విర్ర వీగాడు. ఇవాళ అద్భుతంగా రాణించిన నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టాడు. టీమిండియాలో రియల్ మొనగాడు వీడేనంటూ ప్రశంసించాడు. ఈ క్రమంలో యూటర్న్ తీసుకున్న సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Ravichandran Ashwin weighs in on Ishan Kishan: అఫ్ఘాన్ పై సెంచ‌రీ చేశాడ‌ని ఎగిరి ప‌డొద్దు..వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఇషాన్ అస‌లు ప‌నికే రాడు

వైభ‌వ్ ను చూస్తే వ‌ణుకుపుడుతోంది..లంక ప్లేయ‌ర్లకు న‌ర‌కం చూపించాడు

Advertisement

ట్రై సిరీస్ ఫైనల్స్ లో భాగంగా శ్రీలంకపై వైభవ్ సూర్యవంశీ దుమ్ము లేపే బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకపై ప్రతీకారం తీర్చుకుంటూ వైభవ్ అదరగొట్టాడని వెల్లడించారు. 50 ఓవర్ల మ్యాచ్ ను విధ్వంసకరంగా మార్చాడని పేర్కొన్నారు. వన్డే అనే విషయాన్ని మర్చిపోయి.. శ్రీలంక ప్లేయర్లకు నరకం చూపించాడని వెల్లడించారు. వన్డేలలో 10 ఓవర్ల పాటు సర్కిల్ బయట ఇద్దరు మాత్రమే ఫీల్డర్లు ఉంటారని.. దాన్ని బాగా వాడుకున్నాడని వైభవ్ పై ప్రశంశల వర్షం కురిపించాడు.

మొన్న గొడవ సమయంలో తిట్టిన ఈ సంజయ్ మంజ్రేకర్… ఇప్పుడు యూటర్న్ తీసుకొని అతన్ని మెచ్చుకోవడం వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా మొన్న గ్రూప్ స్టేజిలో లంక ప్లేయర్లతో వైభవ్ గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీని కించపరుస్తూ మాట్లాడారు సంజయ్ మంజ్రేకర్. మొన్నటి గొడవలో వైభవ్ తప్పిదం ఉందని.. కానీ కోచ్ అయితే, వాడిని జట్టు నుంచి బయటకు పంపించే వాడినట్టు వార్నింగ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని మెచ్చుకుంటున్నాడు.

Advertisement

 

Also Read:  Tanveer Ahmed On ICC Womens World Cup 2026 Womens Pakistan Team: నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..కోచ్ వహాబ్ రియాజ్ కు వార్నింగ్

 

Related News

మ‌ళ్లీ వైభ‌వ్ కాల‌ర్లు ప‌ట్టుకుంటాడ‌ని భ‌యంతో శ్రీలంక బౌల‌ర్లు స్లోగా బంతులు వేశారు !

15 ఏళ్ల వ‌య‌స్సులో నాకు బ్యాట్ స‌రిగ్గా పట్టుకోలేకపోయేవాడిని..కానీ వైభ‌వ్ మాత్రం !

వైభ‌వ్ మాములోడు కాదు, 8వ‌ వండ‌ర్..ఆ బ్యాటింగ్ చూసి పిచ్చోడిని అయిపోయా

IND VS SL : ‘ఇదెక్కడి మాస్ రా మామ’…టీమిండియా ప్రొజెక్టెడ్ స్కోర్ 910 అంటూ పోస్టులు

అన‌వ‌స‌రంగా వైభ‌వ్ గెలికారు..ఇప్పుడు అనుభ‌వించండి, లంక ప్లేయ‌ర్ల‌పై గ‌వాస్క‌ర్‌ సెటైర్లు

తిట్టిన నోళ్ల‌తోనే, శ‌భాష్ అనిపించుకున్నాడు..వైభ‌వ్ ను మెచ్చుకున్న‌ లంక ప్లేయ‌ర్లు

జై షా చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవ‌డం ఇష్టం లేక పాకిస్తాన్ ఎలిమినేట్ అయింది

Big Stories

×