BigTV English

Rohit Sharma : రోహిత్ శర్మ ‘అదరహో’..రికార్డులు బెదరహో..నాలుగు ప్రపంచ రికార్డులు నమోదు

Rohit Sharma : రోహిత్ శర్మ ‘అదరహో’..రికార్డులు బెదరహో..నాలుగు ప్రపంచ రికార్డులు నమోదు
Rohit Sharma hit

Rohit Sharma : ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ లో కింగ్ కొహ్లీ సెంచరీ కన్నా, రోహిత్ శర్మ స్రష్టించిన రికార్డులే ఎక్కువగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈరోజు బంగ్లాతో మ్యాచ్ లో రోహిత్ చేసిన 48 పరుగులతో నాలుగు రికార్డులను సొంతం చేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా ఒక రికార్డ్ సృష్టించాడు.


వరల్డ్ కప్ అంటేనే రోహిత్ శర్మకు పూనకం వచ్చేస్తుందని అంతా అంటుంటారు. ఎందుకంటే 2019 వరల్డ్ కప్ ని ఎవరూ మరిచిపోరు. తను వరుసగా చేసిన కళ్లు చెదిరే సెంచరీలు ఇప్పటికీ చాలామందికి గుర్తుంటాయి. అయితే మళ్లీ 2023లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని అనుకున్నారు. ఎందుకంటే ఆఫ్గాన్ మీద చేసిన సెంచరీ, తర్వాత పాక్ మీద 86 పరుగులు చేసి, సెంచరీ ముంగిట అవుట్ అయ్యాడు. ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ మీద అదే ఊపు కనిపించింది. కానీ దురదృష్టవశాత్తు..48 పరుగులకి అవుట్ అయిపోయాడు. అయితే ఇందులో 7 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి.

అయితేనేం రోహిత్ పేరిట కొత్త ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి.
అంతర్జాతీయ క్రికెట్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు
ఒక ఆటగాడిగా..78 సిక్సులు కొట్టాడు. ఇప్పుడీ క్యాలెండర్ ఇయర్‌లో  ఇండియా కెప్టెన్ గా 61 సిక్సర్లు బాదాడు.


ఇకపోతే రెండో రికార్డ్ ఏమిటంటే.. వన్డే వరల్డ్ కప్ ఛేజింగ్ ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా రోహిత్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

ఇక మూడో రికార్డ్ కి వస్తే.. ఆసియా గడ్డ మీద జరిగిన వన్డేల్లో 6వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్ మెన్ గా కూడా రికార్డ్ సృష్టించాడు.  

చివరిగా నాలుగో రికార్డ్ ఏమిటంటే.. ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ లో జరిగిన 4 మ్యాచ్ ల్లో కలిపి రోహిత్ 265 పరుగులు చేసి నెంబర్ వన్ గా ఉన్నాడు. 259 పరుగులతో విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో ఉన్నాడు .న్యూజిలాండ్ ప్లేయర్  కాన్వే 249 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.  పాకిస్తాన్ ప్లేయర్ రిజ్వాన్ 248 పరుగులతో  నాలుగో స్థానంలో ఉన్నాడు. 229 పరుగులతో దక్షిణాఫ్రికా ప్లేయర్ డికాక్ . 5 ప్లేస్ లో ఉన్నాడు

అయితే 2019 వరల్డ్ కప్ లో కూడా రోహిత్ శర్మ 9 మ్యాచ్ లు ఆడి 648 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచిన సంగతి తెలిసిందే కదా..ఇందులో 5 సెంచరీలు కూడా ఉన్నాయి.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×