BigTV English

Shubman Gill : ఊ అంటాడా..ఊహూ అంటాడా? పూణె మ్యాచ్ లో గిల్ ఫోర్ కొడితే.. సారా చప్పట్లు..

Shubman Gill : ఊ అంటాడా..ఊహూ అంటాడా? పూణె మ్యాచ్ లో గిల్ ఫోర్ కొడితే.. సారా చప్పట్లు..
Shubman Gill

Shubman Gill and Sara Tendulkar : వన్డే వరల్డ్ కప్ 2023లో ఎన్నో వింతలు, విశేషాలు, విడ్డూరాలు నమోదవుతూనే ఉంటాయి. ఇక ఇండియా ఆడిందంటే ఆరోజు ఇలాంటి వాటికి కొదవే ఉండదు. ప్రతీదీ ఆసక్తికరమే..ముఖ్యంగా బంగ్లాదేశ్ తో పుణలో జరిగిన మ్యాచ్ కి ఒక ప్రత్యేక అతిథి విచ్చేశారు. తనెవరో కాదు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్..తనెందుకు వచ్చిందో అందరికీ తెలిసిందే..


ఇంకెవరు ఇండియన్ క్రికెట్ లో యువ సంచలనం..శుభ్ మన్ గిల్.. తన కోసమే వచ్చింది సారా. తను క్రీజులో ఉన్నంత సేపు ఉల్లాసభరితంగా గడిపింది. శుభ్ మన్ ఫోర్లు, సిక్సులు కొట్టినప్పుడల్లా ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహించింది. అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సారా రియాక్షన్స్ ని పట్టుకుని నెటిజన్లు ‘సారా ఛిల్’ అంటూ షేర్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో గిల్ 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశారు.

ఇక్కడ చిత్రమైన సంగతేమిటంటే గిల్ ఫోర్ లేదా సిక్స్ కొట్టినప్పుడు అది చూపించకుండా కెమెరామెన్ పుటుక్కున సారా వైపు తిప్పేవాడు. ఆమె ఆనందాన్ని చూపించేవాడు. తర్వాత జనానికి రీప్లే లో నెమ్మదిగా సిక్స్ ఎలా కొట్టాడో చూపించేవారు. మొత్తానికి సారా ఎగ్ట్జైట్ మెంట్ మాత్రం మామూలుగా లేదు.


మొదట్లో గిల్, సారా టెండూల్కర్ ఇద్దరి మధ్యా ఏదో ఉందని అంతా అనుకున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు కామెంట్లు చేసుకుంటూ, బదులిచ్చుకుంటూ వెళ్లారు. అప్పట్లో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ మ్యాచ్ కి హాజరైనట్టే గిల్ ఆడే మ్యాచ్ లకు సారా తప్పనిసరిగా హాజరయ్యేది. దాంతో అందరికీ బలం చేకూరింది. అయితే సారా అత్యుత్సాహమే తప్ప..గిల్ ఈ విషయంలో పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. తను మాత్రం కూల్ గానే కనిపిస్తున్నాడు. మన మాజీ క్రికెటర్లలా టెంప్ట్ అవడం లేదు.

అయితే వీరిమధ్య ఒక ట్విస్ట్ కూడా ఉంది. బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ కూతురు, స్టార్ హీరోయిన్ సారా ఆలీఖాన్ తో మనోడు ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ కూడా రెస్టారెంట్లకు వెళ్లడం అందరికంటా పడింది. ఇటు సచిన్ కూతురు పేరు సారా, సైఫ్ ఆలీఖాన్ కూతురు పేరు కూడా సారానే..ఇద్దరి పేర్లు ఒకటయ్యేసరికి నెటిజన్లు కన్ ఫ్యూజ్ అయి..సారా-గిల్ రెస్టార్టెంట్లలో కనిపిస్తున్నారని రాసి పారేసేవారు.ఈమె-ఆమె ఒక్కరేనా? లేక వేరు వేరా? అని కొందరు నెటిజన్లు తెగ కన్ ఫ్యూజ్ అయ్యేవారు.

మొత్తానికి పుణె మ్యాచ్ తో అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చింది. సీన్ లో ఇక సారా టెండూల్కర్ ఒక్కరే ఉన్నారు. మరి గిల్ ఓకే చెబుతాడో లేదో వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో గిల్  హవా మామూలుగా లేదు. గిల్ ఊ అంటే చాలు..ఎంతోమంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి చిన్నోడు గిల్.. ఊ అంటాడో ఊహూ అంటాడో తెలీడం లేదు.

Related News

IND Vs PAK : టీమిండియాతో ఫైన‌ల్‌..ఓపెన‌ర్ గా షాహీన్ అఫ్రిదీ..పాక్ అదిరిపోయే ప్లాన్‌

IND VS PAK Final: ఇండియాను వ‌ణికిస్తున్న పాత రికార్డులు..అదే జ‌రిగితే పాకిస్థాన్ ఛాంపియ‌న్ కావ‌డం పక్కా ?

IND Vs PAK : నోరు జారిన షోయబ్ అక్తర్.. అభిషేక్ బచ్చన్ ను సీన్ లోకి లాగి

IND VS PAK, Final: ట్రోఫీ ఇవ్వ‌నున్న‌ నఖ్వీ.. వాడిస్తే మేం తీసుకోబోమంటున్న టీమిండియా..!

IND Vs PAK : ‘షేక్ హ్యాండ్’ వివాదం పై పాకిస్తాన్ కెప్టెన్ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

NEP-WI : నేపాల్ సరికొత్త చరిత్ర.. వెస్టిండీస్ జట్టుపై చారిత్రాత్మక విజయం 18వ ర్యాంక్ లో ఉండి వణుకు పుట్టించింది

IND vs PAK Final: నేడు ఆసియా క‌ప్‌ ఫైన‌ల్స్‌..పాండ్యా దూరం..టెన్ష‌న్ లో టీమిండియా, టైమింగ్స్‌..ఉచితంగా ఎలా చూడాలి

Asia Cup 2025 : టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ లో గెలిచేదెవ‌రు..చిలుక జోష్యం ఇదే

Big Stories

×