E-Paper
Advertisement

Rohit Sharma: చేతులు లాగి దాడి చేసిన బచ్చాగాళ్లు…రోహిత్ శ‌ర్మ సీరియ‌స్ వార్నింగ్

Rohit Sharma: చేతులు లాగి దాడి చేసిన బచ్చాగాళ్లు…రోహిత్ శ‌ర్మ సీరియ‌స్ వార్నింగ్
Advertisement

Rohit Sharma:  టీమిండియా మాజీ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు ( Rohit Sharma) ఘోర అవమానం ఎదురయింది. సెల్ఫీల కోసం వచ్చిన బచ్చా పోరగాళ్లు ఓవరాక్షన్ చేశారు. చిన్నపిల్లలు కదా అని సెల్ఫీలు అడిగితే, సహకరించిన రోహిత్ శర్మాకు చుక్కలు చూపించారు. సెల్ఫీలు దిగుతూ రోహిత్ శర్మ చేతులను లాగేశారు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన రోహిత్ శర్మ, తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. అనంతరం ఆ పిల్లలకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు రోహిత్ శర్మ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ముంబైలోని ఈవెంట్ కు శనివారం రోహిత్ శర్మ వెళ్ళినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా కారు ఎక్కి ఇంటికి వెళ్లే క్రమంలో ఈ కుర్రాళ్ళు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ చేదు సంఘటన జరిగినట్లు చెబుతున్నారు. దీనిపై రోహిత్ శర్మ అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఆ బచ్చా గాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని పోస్టులు పెడుతున్నారు రోహిత్ శర్మ అభిమానులు.

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

వన్డేల్లో అదరగొడుతున్న రోహిత్ శర్మ

Advertisement

వన్డే కెపెన్సి తొలగించిన తర్వాత దూకుడే లక్ష్యంగా రోహిత్ శర్మ  ( Rohit Sharma) ఆడుతున్న సంగతి తెలిసిందే. 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున బరిలోకి దిగి రిటైర్మెంట్ ప్రకటించాలన్నది రోహిత్ శర్మ చిరకాల స్వప్నం. ఆ కోరిక నెరవేరాలంటే ఇప్పటినుంచే కచ్చితంగా వన్డేల్లో అద్భుతంగా రాణించాలి. గౌతమ్ గంభీర్ లాంటి కీచకుడు ఉన్నన్ని రోజులు రోహిత్ శర్మ స్థానానికి ప్రమాదమే ఉంటుంది. అందుకే ప్రతి మ్యాచ్ లో అదరగొడుతున్నాడు రోహిత్ శర్మ.

దాదాపు 20 కిలోలు ఈ మధ్య తగ్గి, వింటేజ్ రోహిత్ శర్మ ( Rohit Sharma) అవతారంలో దూకుడుగా ఆడుతున్నాడు. దేశవాలి క్రికెట్ ఆడమని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు ఇస్తే.. ఫాలో అవుతూ అక్కడ కూడా దుమ్ము లేపుతున్నాడు రోహిత్ శర్మ. అటు విరాట్ కోహ్లీ కూడా అదరగొడుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు క్రికెటర్లు 2027 వన్డే వరల్డ్ కప్ లో ఆడతారని అంటున్నారు. ఈ ఇద్దరు ఆడడమే కాదు టీమిండియా కు టైటిల్ కూడా తీసుకువచ్చే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

న్యూజిలాండ్ తో వన్డేలు.. రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జనవరి 11వ తేదీ నుంచి వన్డేలు ప్రారంభం కానున్నాయి. 3 వన్డేల సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియాను కూడా ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ జట్టులో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఇలా 2026 సంవత్సరంలో దాదాపు 18 వన్డేలు రోకో కాంబినేషన్ ఆడనున్నట్లు తెలుస్తోంది. వడోదర వేదికగా మొదటి వన్డే జరగనుండగా ఇప్పటికే 35 వేల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు అయ్యాయి.

Also Read:  BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు

 

 

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×