BigTV English

Rohit Sharma : రోహిత్ శర్మ స్పీడు మామూలుగా లేదుగా.. కారుపై 3 చలాన్లు, 200 kmph స్పీడ్..

Rohit Sharma : రోహిత్ శర్మ స్పీడు మామూలుగా లేదుగా.. కారుపై 3 చలాన్లు, 200 kmph స్పీడ్..


Rohit Sharma
: ఆడు మగాడ్రా బుజ్జీ! 200 కిమీ స్పీడ్ తో దూసుకెళ్లిన రోహిత్ శర్మ. ఎక్స్ లేటర్ మీద కాలు పెట్టి ఒక్క నొక్కు నొక్కి…రయ్ మని జెట్ స్పీడ్ లో వెళ్లిపోతున్నాడు.  ఈ విషయం ఎలా బయటపడిందంటే తాజాగా పోలీస్ శాఖ ట్రాఫిక్ విభాగం ఒకేసారి మూడు చలాన్లు విధించింది. దీంతో విషయం బయట ప్రపంచానికి తెలిసింది.


అమ్మ…కెప్టెను…నీలో ఇంత ఉందా? అని చాలామంది అమ్మాయిలు నోళ్లు నొక్కుకుంటున్నారు. అబ్బాయిలేమో…ఆడు మగాడ్రా బుజ్జీ అంటున్నారు. పోలీసులేమో అంత స్పీడొద్దు బాబూ అంటున్నారు. భారత క్రికెట్ అభిమానులేమో..వరల్డ్ కప్ ముందెట్టుకుని ఈ చిన్నులేంటి చిన్నా! అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అయి ఉండి ఎంత బాధ్యతగా ఉండాలి? నువ్వే ఇంత స్పీడ్ నడిపితే నిన్ను చూసి ఇన్ స్పైర్ అయ్యే యువత ఇంకెంత స్పీడుగా నడుపుతుందో ఆలోచించావా? అని పెద్దలు మందలిస్తున్నారు.


ఇంతకీ విషయం ఏమిటంటే పాకిస్తాన్ తో అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ ముగిసింది. గెలిచిన ఆనందంలో మన రోహిత్ శర్మ కుటుంబంతో గడపడానికి హెలికాఫ్టర్ లో ముంబాయి వెళ్లాడు. తర్వాత బంగ్లాదేశ్ తో మ్యాచ్ పుణెలో ఉంది. మరి ముంబై నుంచి పుణె దగ్గరే కదా…అదీ కాకుండా 8 లైన్స్ ఎక్స్ ప్రెస్ హైవే…
ఇంకేం ఉంది…
కొత్తగా కొన్న లంబోర్గిని కారు తీశాడు. ఎక్కాడు.
ఎక్స్ లేటర్ ని ఒక నొక్కు నొక్కాడు. ఎంతసేపు  40 నిమిషాల్లో ముంబయి నుంచి పుణెలో ఉన్నాడు.
రెండు గంటల్లో చేరాల్సిన ప్రయాణాన్ని ఇంత తక్కువ సమయంలో ఎలా సాధ్యమైందని అంటారా?

మనవాడు గంటకు 200 కిమీ హై స్పీడ్ తో కారు నడిపాడంట. ఒకొక్క సందర్భంలో 215 కిమీ కూడా వెళ్లిందంట.. అందుకనే పోలీస్ శాఖ మూడు చలాన్లు విధించింది. పనిలో పనిగా ఒక క్లాస్ కూడా పీకింది.

మరోవైపు నెటిజన్లు మరో సలహా చెబుతున్నారు. మీ క్రికెట్ సహచరుడు రిషబ్ పంత్ కి జరిగిన ఏక్సిడెంట్ ని మరిచిపోయావా కెప్టెన్ అన్నయ్యా అంటూ కామెంట్ చేస్తున్నారు.
తను కూడా నీలాగే హై స్పీడ్ తో వెళితేనే కారు తట్టుకోలేకపోయింది.. మంటలు చెలరేగాయి, అదృష్టవశాత్తూ బతికి బట్టకట్టాడని అంటున్నారు.
కళ్ల ముందు ఒక క్రికెటర్ కే ఇలా జరిగినప్పుడు…
ఒక కెప్టెన్ అయి ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు. ‘రోహిత్ బాబూ…అంత స్పీడొద్దు’ కొంచెం తగ్గించుకుంటే మంచిదని చెబుతున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×