BigTV English

Yashasvi Jaiswal: యశస్వీ ఆట చూస్తుంటే సచిన్ గుర్తొచ్చాడు: రవిశాస్త్రి.. ఇలాగే చితక్కొట్టేయాలి: సెహ్వాగ్

Yashasvi Jaiswal: యశస్వీ ఆట చూస్తుంటే సచిన్ గుర్తొచ్చాడు: రవిశాస్త్రి.. ఇలాగే చితక్కొట్టేయాలి: సెహ్వాగ్

Ravi Shastri and Virender Sehwag About Yashasvi Jaiswal Record in IND Vs ENG 3rd Test: యశస్వి జైశ్వాల్ తన ఆటతీరుతో క్రికెట్ అభిమానులనే కాదు, సీనియర్ క్రికెటర్లను ఆకట్టుకున్నాడు. పలువురు యశస్వి ఆటతీరు చూసి ముచ్చటపడ్డారు. అందులో ముఖ్యంగా సీనియర్ క్రికెటర్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. యశస్విని చూస్తుంటే, తొలిరోజుల్లో సచిన్‌ని చూసినట్టుగా అనిపించిందని అన్నాడు.


తను కూడా కుర్రాడిగా ఉన్నప్పుడు, ఇలాగే ధనాధన్ ఆడేవాడని గుర్తు చేసుకున్నాడు. స్వీప్, రివర్స్ స్వీప్, లాఫ్టెడ్ షాట్లతో తనలాగే అలరించాడని అన్నాడు. జైశ్వాల్ బహుముఖ ప్రజ్ఞ ఎంతగానో ఆకట్టుకుందని తెలిపాడు. అలాగే సెంచరీ చేసిన తర్వాత తను గ్రౌండ్‌లో వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయని అన్నాడు.

బ్యాట్ తోనే కాదు మైదానంలో చురుగ్గా కదలడం చూస్తుంటే, టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా మారనున్నాడని తెలిపాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మకి రాబోయే రోజుల్లో యశస్వి బెస్ట్ ఛాయిస్ అని అన్నాడు. తనతో అద్భుతాలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 


బంతి లెగ్-స్పిన్, ఆఫ్-స్పిన్ లేదంటే మీడియం-పేస్ ఏదైనా సరే, కొడితే బౌండరీ లేదంటే సిక్స్ రావల్సిందేనని అన్నాడు. ఇలాంటి ఆటగాడు ఒక్కడుంటే చాలునని, మ్యాచ్ స్వరూపమే మారిపోతుందని కొనియాడాడు.

Read More: యశస్వీ భవ :వేగంగా సెంచరీలు చేసిన బ్యాటర్ గా రికార్డ్

ఇలాగే చితక్కొట్టాలి.. సెహ్వాగ్
వెటరన్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా  జైస్వాల్‌ ఆట తీరును  ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ”జైస్వాల్ బ్యాక్‌ టూ బ్యాక్ సెంచరీలు  చేస్తున్నాడని కొనియాడాడు. అంతే కాదు స్పిన్నర్లను అలానే చితక్కొట్టాలని సలహా ఇచ్చాడు. యశస్వి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు.

sports news in telugu

యశస్వి సెంచరీతో.. రోహిత్ గెంతులు

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆనంద పరవశుడయ్యాడు. యశస్వి సెంచరీ చేయగానే, డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక్క జంప్ చేశాడు. కమాన్ యశస్వి, కమాన్ అంటూ ప్రోత్సహించాడు. తను సెంచరీ చేయగానే రోహిత్ శర్మ ముఖంలో టెన్షన్ అంతా పోయింది. మ్యాచ్ గెలిచామనే నమ్మకం కలిగింది. 

అంతేకాదు సిరాజ్ కూడా ఫామ్‌లోకి రావడంతో తనకి బౌలింగ్ విభాగంలో కొండంత భారం దిగినట్టయ్యింది. ఎందుకంటే అశ్విన్ లేని లోటుని సిరాజ్ భర్తీ చేయడంతో అందరి మససులు తేలికపడ్డాయి. 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×