E-Paper
Advertisement

Sharmila’s Son Marriage: మేనల్లుడి పెళ్లికి జగన్ దూరం.. అదే అసలు కారణం!

Sharmila’s Son Marriage: మేనల్లుడి పెళ్లికి జగన్ దూరం.. అదే అసలు కారణం!
Advertisement
today latest news telugu

YS Rajareddy – Priya Atluri Marriage in Jodhpur : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి-ప్రియ అట్లూరి ల పెళ్లి.. జోథ్ పూర్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి షర్మిల సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కాలేదు. జోథ్ పూర్ ప్యాలెస్ లో ఇరు కుటుంబాల బంధువులు, సన్నిహితుల సమక్షంలో రాజారెడ్డి – ప్రియ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

మూడు రోజుల క్రితమే పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. వివాహ వేడుకలలో భాగంగా 15న సంగీత్, మెహందీ కార్యక్రమం జరిగింది. శనివారం సాయంత్ర 5.30 గంటలకు వధూవరులు బంధుమిత్రుల సాక్షిగా ఒక్కటయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలను వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పెళ్లిఫొటోలు ఇంకా బయటకు రాలేదు కానీ.. హల్దీ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Read More : ఏపీ పోలీసులపై షర్మిల మండిపాటు.. సత్తెనపల్లి ఘటనపై వెంటనే స్పందించాలని డిమాండ్

పెండ్లికొడుకు రాజారెడ్డి, పెండ్లి కూతురు ప్రియ.. వైట్ అండ్ వైట్ లో మెరవగా.. మిగతా వారంతా పసుపు రంగు దుస్తుల్లో కనిపించారు. వైఎస్ షర్మిల, అనిల్ కుమార్, కూతురు అంజలి, తల్లి విజయమ్మ ఈ ఫొటోల్లో కనిపించారు. జనవరి 18న హైదరాబాద్ లో రాజారెడ్డి-ప్రియల ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఆ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఎంగేజ్ మెంట్ కు జగన్ తూతూమంత్రంగా హాజరయ్యారని.. అప్పట్లో వీడియోలు వైరల్ అయ్యాయి.

Tags

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×