BigTV English

Rohith Sharma: రోహిత్ శర్మ.. రెండు షాకింగ్ న్యూస్ లు.. ఐపీఎల్ కి దూరం..?

Rohith Sharma: రోహిత్ శర్మ.. రెండు షాకింగ్ న్యూస్ లు.. ఐపీఎల్ కి దూరం..?
Rohit Sharma comments on Retirement
Rohit Sharma comments on Retirement

Rohit Sharma Two Shocking News: ఏ రోజు అయితే పొద్దున్న లేవగానే…నేనింక క్రికెట్ ఆడలేనని అనుకుంటానో ఆ క్షణమే రిటైర్మంట్ ప్రకటిస్తానని రోహిత్ శర్మ సంచలన ప్రకటన చేశాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ ముగిసిన వెంటనే అధికారిక బ్రాడ్‌కాస్టర్‌ జియో సినిమాతో మాట్లాడిన ఇండియన్ కెప్టెన్ తన రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


ఇంగ్లాండ్ తో జరిగిన చివరిటెస్టులో విజయం తర్వాత రోహిత్ శర్మ చాలా ఉత్సాహంగా కనిపించాడు. టీమ్ ఇండియా  4-1తేడాతో సిరీస్ గెలుచుకుంది. అయితే తొలి టెస్ట్ మ్యాచ్ ఓటమి తర్వాత తిరిగి పుంజుకుని వరుసగా అన్నీ గెలవడం కూడా ఒక రికార్డ్ అనే చెబుతున్నారు.

ఈ సంతోష సమయంలో రోహిత్ శర్మ మనసులో మాటలను నిర్మోహమాటంగా తెలిపాడు. రిటైర్మెంట్ గురించి ఒకరు అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
నిజంగా నేనిక ఆడలేనని ఏ క్షణమైతే ఫీలవుతానో, ఆ మరుక్షణం  రిటైర్మెంట్ ప్రకటిస్తానని తెలిపాడు. ఇలా అంటూనే గత మూడేళ్లుగా మెరుగ్గా క్రికెట్ ఆడుతున్నానని, గతం కన్నా తన ఆట తీరు ఎంతో మెరుగైందని అన్నాడు.


Read More: ఈ విజయానికి యువ క్రికెటర్లే కారణం: రోహిత్ శర్మ

ఈ సమావేశమైన వెంటనే మరో షాకింగ్ నిర్ణయం ఒకటి తెలిసింది. అదేమిటంటే ఐపీఎల్ ఫస్ట్ సీజన్ కి రోహిత్ శర్మ దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ఈ ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో పలువురు సీనియర్లు రెస్ట్ తీసుకున్నారు గానీ, రోహిత్ శర్మ తీసుకోలేదు.

అంతే కాదు ఆఖరి టెస్టులో సెంచరీ కూడా చేశాడు. దీనివల్ల తనకి వెన్నునొప్పి ఎక్కువైనట్టు సమాచారం. ఇదే విషయాన్ని బీసీసీఐ అధికారిక వెబ్ సైట్ లో చెప్పింది. ఈ కారణం చేతనే తను టీ 20 ప్రపంచ కప్ నకు ముందు వరకు రెస్ట్ తీసుకోవాలని, అలాగే పొట్టి ప్రపంచ కప్ నకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఇదే విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ యాజమాన్యానికి రోహిత్ శర్మ తెలియజేసినట్టు తెలిసింది. అయితే జట్టులో హార్దిక్ కెప్టెన్ గా ఉండటం వల్ల తన అవసరం పెద్దగా ఉండకపోవచ్చునని కూడా రోహిత్ శర్మ భావిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×