BigTV English

Rohit Sharma compare with Dhoni: రవిశాస్త్రి వ్యాఖ్యలు.. ధోని సరసన రోహిత్ శర్మ అంటూ..

Rohit Sharma compare with Dhoni: రవిశాస్త్రి వ్యాఖ్యలు.. ధోని సరసన రోహిత్ శర్మ అంటూ..

Rohit Sharma compare with Dhoni: టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారితీసింది. అత్యుత్తమ కెప్టెన్సీలో ఎంఎస్ ధోని సరసన రోహిత్‌శర్మ నిలుస్తాడని వ్యాఖ్యానించాడు. దీనిపై దుమారం మొదలైంది.


ఆగస్టు రెండు నుంచి శ్రీలంక-టీమిండియాల మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్‌ తోపాటు మరికొందరు అక్కడికి చేరుకున్నారు. ప్రాక్టీసులో నిమగ్నమయ్యారు. రోజుకు నాలుగైదు గంటల సాధనలో నిమగ్నమయ్యారు.

ఇదిలావుండగా టీ20 ప్రపంచ‌కప్‌లో రోహిత్‌శర్మ వ్యవహరించిన తీరు అద్భుతంగా ఉందన్నాడు మాజీ కోచ్ రవిశాస్త్రి. ప్రశాంతంగా ఉండడం, అవసరమైనప్పుడు సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం బాగుందన్నాడు. అవసరమైనప్పుడు బౌలర్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అక్సర్‌పటేల్‌ను వినియో గించుకుని మంచి అవుట్‌పుట్ సాధించారన్నాడు.


రోహిత్‌శర్మ వ్యూహకర్త మాత్రమేకాదు, మంచి ఆటగాడన్న విషయాన్ని మరిచిపోకూడదని గుర్తు చేశాడు టీమిండియా మాజీ కోచ్. అత్యుత్తమ కెప్టెన్లలో ధోనీతో‌పాటు రోహిత్ ఒకడిగా ఉంటాడని భావిస్తున్నట్లు ఐసీసీ రివ్యూలో ప్రస్తావించాడు.

ALSO READ:  మెగా వేలం వద్దు.. మినీ వేలం ముద్దు : షారూఖ్ మాటలతో రచ్చ.. మద్దతు తెలిపిన కావ్య

రోహిత్‌శర్మ- ధోనిల్లో ఎవరు బెటర్ అన్నదానికి రిప్లై ఇచ్చారు రవిశాస్త్రి. రోహిత్ పెద్ద షాట్స్ ఆడుతాడని, త్వరగా స్కోర్ చేయడమేకాదు, భారీ స్కోర్‌కు ప్లాన్ చేస్తాడన్నాడు. వైట్-బాల్ గేమ్‌లో వ్యూహాల విషయానికి వస్తే ఇద్దరు సమానంగా ఉన్నారని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ధోనీ ఏం చేశాడో  అతను గెలిచిన టైటిల్స్ చూస్తే తెలుస్తుందన్నాడు. ఈ విషయంలో రోహిత్‌కి తాను అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఇవ్వలేనన్నాడు.

రవిశాస్త్రి చేసిన కామెంట్స్‌పై ధోని హార్డ్ కోర్ అభిమానులు మండిపడుతున్నారు. ఎవరి‌శైలి వారిదని, ఒకరితో మరొకరిని కంపేర్ చేయడం మంచిది కాదంటున్నారు. గతంలోనూ వీరిద్దరిపై పెద్ద చర్చ జరిగిందిన విషయం తెల్సిందే.

Related News

5 Balls Won Match: 5 బంతుల్లో ముగిసిన మ్యాచ్…7 గురు డకౌట్… 23 పరుగులకే ఆలౌట్

Mohamed Siraj : సేమ్ టు సేమ్ డిట్టు దించేశారు… మహమ్మద్ సిరాజ్ కూడా కుళ్ళుకోవాల్సిందే

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Big Stories

×