Big Stories

Rohit Sharma: రోహిత్ శర్మ ఐపీఎల్ ఖాతాలో ఒక చెత్త రికార్డ్..

- Advertisement -

Rohit Sharma’s IPL Match Is A Worst Record: హిట్ మ్యాన్ గా, అభిమానుల అండదండలున్న ఒక గొప్ప క్రికెటర్ గా కీర్తి పొందుతున్న రోహిత్ శర్మ ఖాతాలో ఒక చెత్త రికార్డ్ వచ్చి చేరింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో తను ఆడిన మొదటి బాల్ కే అవుట్ అయి గోల్డెన్ డకౌట్ గా వెనుతిరిగాడు. దీంతో ఏ క్రికెటరు కోరుకోని ఒక చెత్త రికార్డుకి చేరువయ్యాడు.

- Advertisement -

ముంబై వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో బర్గర్, బౌల్ట్ దెబ్బకి ముంబై టాపార్డర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అందులో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. తనతో పాటు మరో ఇద్దరు నమన్ ధిర్, బ్రెవిస్  కూడా గోల్డెన్ డకౌట్ కావడం నెట్టింట పెద్ద చర్చకు తెరతీసింది.

Also Read: మామ మాటలకి తలపట్టుకున్న కేఎల్ రాహుల్ 

ముంబై బ్యాటింగ్ చేసే సమయంలో తొలి ఓవర్ బోల్ట్ వేస్తున్నాడు. తొలి ఓవర్ ఐదో బంతిని షాట్ ఆడేందుకు రోహిత్ ప్రయత్నించాడు. అయితే అనూహ్యంగా బ్యాట్ కి సరిగా కనెక్ట్ కాకపోవడంతో సంజూ శాంసన్ కి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఇలా తొలిబంతికే అవుట్ కావడం ఐపీఎల్ చరిత్రలో  ఇది 17వ సారి. ఇదే రికార్డు బెంగళూరు ఆటగాడు దినేష్ కార్తీక్ పేరు మీద కూడా ఉండటం విశేషం.

వీరి తర్వాత పీయూష్ చావ్లా, మన్ దీప్ సింగ్, గ్లెన్ మ్యాక్స్ వెల్  వీరు ముగ్గురూ 15 డకౌట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మనీశ్ పాండే, రషీద్ ఖాన్, అంబటి రాయుడు 14 డకౌట్లతో మూడో స్థానంలో ఉన్నారు. హిట్టింగ్ చేసే బ్యాటర్లందరూ ఈ డకౌట్ల బారిన పడుతూనే ఉంటారు. అప్పట్లో ఓపెనర్ గా ఉన్న క్రష్ణమాచారి శ్రీకాంత్, తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ జాతీయజట్టులో డకౌట్ల బారిన పడిన వారే… ఇప్పుడు తాజాగా వీరందరూ చేరారు.

2024 సీజన్ లో ఇంకా పలు మ్యాచ్ లు ఉన్నాయి. మరి వీటిలోనే వీళ్లలో ఎవరైనా ఒకరిని మించి ఒకరు ముందుకెళతారా? లేక ఆగుతారా? అనేది వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News