BigTV English

Athiya Shetty and KL Rahul: మామ మాటలకి తలపట్టుకున్న కేఎల్ రాహుల్

Athiya Shetty and KL Rahul: మామ మాటలకి తలపట్టుకున్న కేఎల్ రాహుల్


Did Suniel Shetty Hint At Athiya Shetty And KL Rahul’s Pregnancy: ఒకనాటి బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ప్రస్తుతం డ్యాన్స్ మస్తీ అనే రియాల్టీ షోకి జడ్జిగా ఉన్నాడు. దీనికి ముందు ఒక మాట చెప్పాలి. అదేమిటంటే ఇతని కుమార్తె అతియా శెట్టి, అల్లుడు మరెవరో కాదు కేఎల్ రాహుల్.. అదేనండి మన క్రికెటర్.. ప్రస్తుతం లక్నో జట్టు కెప్టెన్ గా ఉన్నాడు. వీరిద్దరికి గత ఏడాది వివాహమైంది. అంతకు ముందు వాళ్లు  ప్రేమలో రెండేళ్లు గడిపారు. తర్వాత ఒకరంటే ఒకరికి పరస్పరం ఇష్టం ఏర్పడింది. దాంతో సునీల్ శెట్టి కి ఉన్న ఖరీదైన ఖండాలా ఎస్టేట్ లో సంప్రదాయబద్దంగా అతియాశెట్టి, కేఎల్ రాహుల్ వివాహం గత ఏడాది జరిగింది.

కట్ చేస్తే.. ఇప్పుడు డ్యాన్స్ మస్తీ రియాల్టీ షో నిర్వాహకులు గ్రాండ్ మస్తీ విత్ గ్రాండ్ పేరెంట్స్.. అని ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమెడియన్ భారతీ సింగ్.. సునీల్ శెట్టిని ఒక ప్రశ్న వేసింది. సునీల్ సార్.. మీకు మనవడు, లేదా మనవరాలు పుట్టి తాతయ్య అయిపోయాక ఎలా ఉంటారు? అని అడిగింది.


దీంతో తను క్యాజువల్ గా అన్నాడు. ఈ రియాల్టీ షో అయిన ఏడాదికి, లేదా తదుపరి సీజన్ వచ్చేసరికి నేను తాతయ్యగా ఉంటానని అన్నాడు. ఆయన సరదాగా అన్నారో, సీరియస్ గా అన్నారో, లేక క్యాజువల్ గా అన్నారో తెలీదు కానీ.. నెట్టింట గుప్పుమని పొగ రేగింది.

Also Read: అభిమానులను వారించిన రోహిత్ శర్మ

నెట్టింటి సంగతి తెలుసు కదా.. ఇదిగో తోక అనగానే నిప్పు పెట్టేశారు. లంకా దహనం జరిగిపోయింది. అందరూ అతియాశెట్టి ప్రెగ్నెన్సీ అంటూ అల్లుకుపోయారు. ఇప్పుడది కరెక్టు కాదని అంటున్నారు.  వారికి గత ఏడాదే వివాహమైంది. అప్పుడే పిల్లల్ని కనాలని అనుకోవడం లేదని వాళ్లు చెప్పలేక చెబుతున్నారు. ఎలా చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

తాత సునీల్ శెట్టి ఎంత పనిచేశాడని నలిగిపోతున్నారు. ఇప్పుడెలా చెప్పాలి? పిల్లల్ని అప్పుడే వద్దంటే సంప్రదాయ వర్గం మీద పడిపోతుంది.  సరేనని ఒప్పకున్నా, నిజంగా తను ప్రెగ్నెంట్ అవునో కాదో తెలీదు. ఇప్పుడు వాళ్లు ఒక సంకట స్థితిలో పడిపోయారు. ఇవన్నీ నిజం కాదని అతియాశెట్టి, కేఎల్ రాహుల్ సన్నిహితుల ద్వారా నెమ్మదిగా చెప్పి, సున్నితంగా ఫీలర్స్ వదులుతున్నారు.
ఆయన సరదాగా అన్నారు. అందులో నిజం లేదని చెప్పుకొస్తున్నారు.

మరికొందరైతే వారికి కొత్తగా పెళ్లయ్యింది. ఇంకా జీవితం ఎంతో ఉంది. దాంపత్య జీవితంలోని ఆనందాన్ని వాళ్లు అందుకోనివ్వండి. అప్పుడే బాధ్యతల వలయంలోకి నెట్టేయవద్దని మరోవైపు పోస్టింగులు వస్తున్నాయి. మొత్తానికి తాత సునీల్ ఎంత పని చేశాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే సునీల్ శెట్టిని అందరూ అభినందిస్తున్నారు. సినిమాల్లో ఎంతో ధైర్యంగా నటించే కండల వీరుడికి తాత అనిపించుకోవాలని ఎంతో ఆత్రుతగా ఉందని అంటున్నారు.

Related News

Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు

Indian Cricketers: ఆ ఒక్క నిర్ణయం… టీమిండియా క్రికెటర్లకు రూ.250 కోట్ల నష్టం!

Shubman Gill: సారాతో డేటింగ్… టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లి…చిల్ అవుతున్న గిల్ ?

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Big Stories

×