BCCI : వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో బీసీసీఐ 4వేల 400 కోట్లను ప్రసారాల ద్వారా ఆర్జించాలనే టార్గెట్ పెట్టుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం విధించబోయే 20 శాతం పన్నుపైనే ఇప్పుడు బీసీసీఐ ఆందోళన చెందుతుంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లకు ఆతిధ్యమిచ్చే దేశాలు పన్నులను మినహాయించాలి. అయితే భారత్ ఆ విషయంలో వెనక్కి తగ్గింది. 2016 టీ20 ప్రపంచ కప్ ఆదాయాలపై పన్ను విధించింది. దీని ద్వారా అప్పుడు బీసీసీఐ రూ.193 కోట్లను నష్టపోయింది. ఈ కేసుపై ఇప్పటికీ కోర్టులో పెండింగ్‌లో ఉంది.
వచ్చే ఏడాది అక్టోబర్, నవంబర్‌లో వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. బీసీసీఐ సుమారు 4వేల కోట్లకు పైగా ఆర్జించే ప్లాన్‌లో ఉంది. మ్యాచ్ ప్రారంభం కాకముందే దీనికి సంబంధించిన సమస్యలపై క్లారిటీ తెచ్చుకొనే పనిలో ఉంది బీసీసీఐ. ఒకవేల బీసీసీఐ ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సి వస్తే దాదాపు రూ.995 కోట్ల వరకు పన్నును కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.