BigTV English

Watch Video : ఆఫ్ఘనిస్తాన్ లో కలకలం…. ఒకే దగ్గర లక్షమంది.. క్రికెట్ అంటే ప్రాణమిచ్చేలాగా ఉన్నారే

Watch Video : ఆఫ్ఘనిస్తాన్ లో కలకలం…. ఒకే దగ్గర లక్షమంది.. క్రికెట్ అంటే ప్రాణమిచ్చేలాగా ఉన్నారే

Watch Video : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పడం ఎవ్వరికైనా కష్టమే. కొన్ని సార్లు బౌలర్లు బ్యాటర్లుగా మారి విజృంభిస్తారు. కొంత మంది బ్యాటర్లు కూడా బౌలింగ్ లో రాణిస్తున్నారు. వాళ్లు ఆల్ రౌండర్లుగా మారుతున్నారు. చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో క్రికెట్ లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు క్రికెట్ అభిమానించే వారు కూడా రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నారు. కొన్ని దేశాలు క్రికెట్ ఆడనవి కూడా క్రికెట్ ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇక ఇండియా కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా అప్గానిస్తాన్ కి కూడా రోజు రోజుకు అభిమానులు పెరిగిపోతున్నారు.  ఆసియా కప్ జరుగుతున్న నేపథ్యంలో దుబాయ్ లోని షార్జా వేదికగా పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది.


Also Read :  Digvesh Rathi Fined: దిగ్వేష్ దూల తీరింది…. నితీష్ తో గొడవపై భారీ ఫైన్

అప్గానిస్తాన్ లో బిగ్ స్క్రీన్.. 


ఈ మ్యాచ్ ని వీక్షించేందుకు అప్గానిస్తాన్ ( Afghanistan) లో బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అయితే దాదాపు లక్ష మంది వరకు హాజరై ఈ మ్యాచ్ ను చూశారు. అప్గానిస్తాన్ వాళ్లు రాను రాను క్రికెట్ అంటే ప్రాణం ఇచ్చేలా ఉన్నారుగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది.  ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కానీ  అప్గానిస్తాన్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది.  పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా 36 బంతుల్లో 53 పరుగులు చేసి ఫ్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. చివరి వరకు క్రీజులో   నిల్చొని జట్టుకు మంచి స్కోర్ ని అందించాడు. చివర్లో మహమ్మద్ నవాజ్ 11 బంతుల్లో 21 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు.

పోరాడి ఓడిన అప్గానిస్తాన్.. 

పాకిస్తాన్ జట్టు ఇచ్చిన 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అప్గానిస్తాన్ జట్టు విఫలం చెందింది. ముఖ్యంగా పాక్ పేస్ బౌలర్ షాహీన్ అఫ్రిది ఓపెనర్ ఇబ్రాహీం జాద్రాన్ ను ఔట్ చేయగా.. మరో ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ 38 పరుగులు చేసి నవాజ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒకానొక దశలో 93/2 ఉన్నగా అప్గానిస్తాన్.. 97/7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పాక్ బౌలర్ హారీశ్ రౌఫ్ డబుల్ వికెట్ మేయిడిన్ తో మ్యాచ్ పాకిస్తాన్ వైపునకు వెళ్లింది. చివరిలో అప్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ 16 బంతుల్లో 39 పరుగులు చేసినప్పటికీ అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. 19.5 ఓవర్లలో 143 పరుగులకు అప్గాన్ జట్టు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పాకిస్తాన్ జట్టు 39 పరుగుల తేడా ఘన విజయం సాధించింది. ఆసియా కప్ ప్రారంభానికి ముందు అప్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ పెద్దన్న మరణించినప్పటికీ కెప్టెన్  రషీద్ ఖాన్ మాత్రం టీమ్ వెంటే దుబాయ్ లోనే ఉన్నాడు. పలువురు రషీద్ ఖాన్ కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

Related News

Rashid Khan : రషీద్ ఖాన్ ఇంట తీవ్ర విషాదం… డ్రెస్సింగ్ రూమ్ లో పాకిస్తాన్ ప్లేయర్ల హడావిడి

Asia Cup 2025 : దుబాయ్ లో ఎండలు.. ఆసియా కప్ 2025 టైమింగ్స్ చేంజ్… కొత్త షెడ్యూల్ ఇదే!

BCCI – Dhoni : గంభీర్ పోస్ట్ గల్లంతు.. ధోనీకి స్పెషల్ ఆఫర్ ఇచ్చిన BCCI?

Rahul Dravid Quits: రాజస్థాన్ నుంచి ద్రవిడ్ అవుట్… రంగంలోకి బ్రెట్ లీ ?

Digvesh Rathi Fined: దిగ్వేష్ దూల తీరింది…. నితీష్ తో గొడవపై భారీ ఫైన్

Big Stories

×