Rudrankksh Patil : షూటింగ్‌లో అభినవ్ బింద్రా తరువాత ఆ స్థాయిలో విజయం సాధించిన వ్యక్తి రుద్రాంక్ష్ పాటిల్. ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్ షిప్‌లో లక్ష్యంపై గురి సరిగ్గా పెట్టి బంగారు పతకాన్ని సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆయన ఈ విజయం సాధించాడు. 18 ఏళ్లకు రుద్రాంక్ష ఈ రికార్డు సాధించాడు. బంగారు పతకంతో పాటు 2024లో జరగబోయే పారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
రుద్రాంక్ష్ స్వస్థలం థానే. 17-13 పాయింట్ల తేడాతో డానిలో డెనిస్ సొలాజోపై విజయం పొంది బంగారు పతకాన్ని సాధించాడు. ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో బంగారు పతకాన్ని సాధించిన అతి పిన్న వయస్కుడిగా కూడా రుద్రాంక్ష్ రికార్డ్ నెలకొల్పాడు. గత సంవత్సరం పెరూలో ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని సాధించాడు. ఈ ఏడాది జర్మనీలో జరిగిన ప్రపంచకప్‌లో కూడా బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. అయితే ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారతకు బంగారు పతకాన్ని సాధించిన ఆరవ షూటర్‌గా రుద్రాంక్ష్ పాటిల్ నిలిచాడు.