BigTV English
Advertisement

Suryakumar Yadav : సూర్యా ది గ్రేట్ .. సౌతాఫ్రికాపై సెంచరీ చేసిన తొలి కెప్టెన్ గా రికార్డ్

Suryakumar Yadav : సూర్యా ది గ్రేట్ .. సౌతాఫ్రికాపై సెంచరీ చేసిన తొలి కెప్టెన్ గా రికార్డ్
Suryakumar Yadav

Suryakumar Yadav : సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన మూడు ఫార్మాటు జట్లలో టీ 20 జట్టు తమకి అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా పోషించింది. గెలవకపోయినా, సిరీస్ ని సమం చేసింది. మొదటి టీ 20 మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. రెండో ది సౌతాఫ్రికా గెలిస్తే, మూడోది టీమ్ ఇండియా గెలిచింది. గెలవడమే కాదు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రికార్డులను బ్రేక్ చేయడం విశేషమనే చెప్పాలి.


సెంచరీతో కదం తొక్కిన సూర్య 55 బంతుల్లో 8 సిక్స్ లు, 7 ఫోర్లతో విధ్వంసం చేశాడు. 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో. సౌతాఫ్రికాలో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. అరుదైన రికార్డ్  సాధించాడు. సౌతాఫ్రికా పర్యటనకు వచ్చిన ఇంతకు ముందు కెప్టెన్లు ఒత్తిడితో తమ ఆటని వదిలేసి, జట్టుని పట్టించుకునేవారు. ఇప్పుడా పరిస్థితిని మార్పు చేసి చూపించి, సూర్య ది గ్రేట్ అనిపించుకున్నాడు.

వన్డే వరల్డ్ కప్ 2023లో ఫైనల్ మ్యాచ్ లో ఓటమి తర్వాత సీనియర్లు అందరూ అజ్నాతంలోకి వెళ్లినట్టు వెళ్లిపోయారు. ఎవరూ లేక విధిలేని పరిస్థితుల్లో సూర్య కుమార్ ను ఆస్ట్రేలియాతో జరిగే టీ 20 సిరీస్ కి తాత్కాలిక కెప్టెన్ గా చేశారు.  నిజం చెప్పాలంటే తను వరల్డ్ కప్ లో అంత ప్రభావం చూపించలేదు. కానీ అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సూర్య జాగర్తగా క్యాచ్ పట్టినట్టు  పట్టేశాడు. ఇప్పుడు సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ లో ఆటతో టీమ్ మేనేజ్మెంట్ కి గట్టి కెప్టెన్సీ పరీక్షే పెట్టాడని చెప్పాలి.


అయితే తాజా మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ తొలి 25 బంతుల్లో 27 పరుగులే చేశాడు. అప్పటికే వరుసగా గిల్, తిలక్ వర్మ వికెట్లు వెంటవెంటనే పడటంతో జాగర్తగా ఆడాడు. అప్పటికి స్కోరు 29 పరుగులే ఉంది. దీంతో కొంచెం క్రీజులో కుదురుకున్నాక, అప్పుడు బ్యాట్ ఝులిపించాడు. ఒకరి తర్వాత ఒకరిని చితక్కొట్టాడు.
అంటే తొలి 25 బంతులకి 27 పరుగులు చేసిన సూర్య, తర్వాత 31 బంతులకి 73 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.
ఈ క్రమంలోనే పలురికార్డులు బద్దలు కొట్టాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా ఉన్న రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ రికార్డును సమం చేశాడు. సూర్య కుమార్ ఇప్పటివరకు 4 సెంచరీలు చేశాడు. అయితే 57 ఇన్నింగ్సుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. మ్యాక్స్‌వెల్ 92 ఇన్నింగ్సుల్లో, రోహిత్ శర్మ 140 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించారు. మరి ఈ విషయంలో సూర్య ది గ్రేట్ అని చెప్పక తప్పదు కదా…ఇది చూస్తుంటే తర్వాత జరిగే అఫ్గనిస్తాన్ సిరీస్ లో కూడా సూర్య ఇరగ్గొడితే, 2024లో జరిగే టీ 20 వరల్డ్ కప్ కు కెప్టెన్ పోటీ రేసులోకి వచ్చినట్టే అని చెప్పాలి.

Related News

Abhishek- Gill LV Bag: ఏంట్రా అభిషేక్‌…నీ సంచులు దేశం మొత్తం అమ్మేస్తున్నారా? లేడీస్ హ్యాండ్ బ్యాగులుగా కూడా

CP Sajjanar : వీళ్లేం సెల‌బ్రిటీలు?…రైనా, ధావన్‌లపై స‌జ్జ‌నార్ సీరియ‌స్‌

Cm Revanth Reddy: హైదరాబాద్ లో మ‌రో అంత‌ర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా త‌ర‌హాలో బౌన్సీ పిచ్ లు

BBL New Rule : BBLలో కొత్త రూల్స్‌…ఇకపై బంతి తాకితే అభిమానుల‌కే, త్వ‌ర‌లో ఐపీఎల్ లో కూడా

Jahanara Alam : సె**క్స్ కోసం పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. ఏడ్చేసిన బంగ్లా క్రికెటర్

IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Sree Charani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. గ్రూప్-1 జాబ్, రూ.2.5 కోట్లు, ఇంటి స్థలం

Hong Kong Sixes 2025: 6, 6, 6, 6, 6, 6 పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం..6 బంతుల్లో 6 సిక్స‌ర్లు..వీడియో వైర‌ల్‌

Big Stories

×