BigTV English

SA vs IND Test Series : బాక్సింగ్ డే టెస్ట్‌.. దక్షిణాఫ్రికా ఇండియా హెడ్-టు-హెడ్ రికార్డ్స్..

SA vs IND Test Series : బాక్సింగ్ డే టెస్ట్‌.. దక్షిణాఫ్రికా ఇండియా హెడ్-టు-హెడ్ రికార్డ్స్..

SA vs IND Test Series : టి20 సిరీస్‌ 1-1 డ్రాగా ముగిసిన తరువాత, కే ఎల్ రాహుల్ కెప్టెన్సీలో మెన్ ఇన్ బ్లూ, వన్డేల్లో దక్షిణాఫ్రికాపై 2-1 సిరీస్ విజయాన్ని సాధించింది. కే ఎల్ రాహుల్ దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ విజయం సాధించిన రెండవ భారత కెప్టెన్ అయ్యాడు.


దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు ఇప్పుడు ప్రొటీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు సిద్ధమైంది.ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం సాధించాలని రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ తహతహలాడుతున్నారు. డిసెంబర్ 26 నుండి సెంచూరియన్‌లో ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్ట్‌కి సర్వం సిద్ధమైంది.

దక్షిణాఫ్రికా స్వదేశంలో టెస్ట్ మ్యాచ్‌లలో ఆధిపత్యం చెలాయించినప్పటికీ, 2023లో వివిధ ఫార్మాట్‌లలో ఆధిపత్య ప్రదర్శనలను అనుసరించిన భారత జట్టు చరిత్ర సృష్టించే బలమైన అవకాశాన్ని కలిగి ఉంది.


ఈ కీలక మ్యాచ్‌కు ముందు, టెస్ట్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరిగిన హెడ్-టు-హెడ్ మ్యాచ్‌ల రికార్డులను పరిశీలిద్దాం..

దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు భారత పురుషుల జట్టు టెస్టు సిరీస్‌ను గెలవలేదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు మాత్రమే దక్షిణాఫ్రికాలో సిరీస్‌ విజయం సాధించాయి.

దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు భారత్ 23 టెస్టులు ఆడగా నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. 12 టెస్టుల్లో ఆతిథ్య జట్టు విజయం సాధించింది. 7 టెస్టులు డ్రాగా ముగిసాయి.

మొత్తంగా చూస్కుంటే దక్షిణాఫ్రికాతో భారత్ 42 టెస్టుల్లో తలపడింది. 15 టెస్టుల్లో భారత్ గెలవగా.. 17 దక్షిణాఫ్రికా గెలిచింది. 10 టెస్టులు డ్రాగా ముగిసాయి.

ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో భారత్ ఎనిమిది సిరీస్‌‌లు ఆడింది. వాటిలో ఏడింటిని కోల్పోయింది. 2010-11లో జరిగిన సిరీస్‌ను మాత్రం టీమిండియా డ్రాగా ముగించింది. తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్ విజయం సాధించింది. న్యూలాండ్స్‌లో జరిగిన చివరి టెస్ట్‌ డ్రాగా ముగిసింది.

ప్రస్థుత భారత్‌ బౌలింగ్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. బౌలింగ్‌ ఉన్నంత ప్రమాదకరంగా భారత్‌ బ్యాటింగ్‌ లేకపోవడం ఆందోళన కల్గించే విషయం. భారత్‌ బ్యాటింగ్‌ సగటు టాప్ సిక్స్ చూస్తే విరాట్ కోహ్లీ 49.29 తో తొలి స్ధానంలో ఉండగా శుభ్‌మన్ గిల్ 32.20 తో చివరి స్ధానంలో ఉన్నాడు. యశస్వి జైస్వాల్, గిల్, శ్రేయాస్ అయ్యర్ ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో టెస్టు ఆడలేదు. దక్షిణాఫ్రికాలో రోహిత్ శర్మ కెరీర్ సగటు 15.37 కాగా.. కేఎల్ రాహుల్ సగటు 25.60గా ఉంది. మొత్తంగా దక్షిణాఫ్రికాలో కోహ్లి మాత్రమే మెరుగైన బ్యాటర్‌గా చెప్పొచ్చు. దక్షిణాఫ్రికాలో అతని సగటు 51.35గా ఉంది.

దక్షిణాఫ్రికా ప్రదర్శన కూడా అంతంత మాత్రమే అని చెప్పొచ్చు. ముఖ్యంగా వారి బ్యాటింగ్ యూనిట్‌లో కేవలం ముగ్గురి బ్యాటర్ల సగటు మాత్రమే 30కి పైగా ఉంది. 37.28 సగటుతో డీన్ ఎల్గర్ ముందు వరుసలో ఉన్నాడు. డీన్ ఎల్గర్‌కు ఇదే చివరి సిరీస్. ఎలాగైనా సిరీస్ గెలిచి డీన్ ఎల్గర్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని సఫారీ జట్టు తహతహలాడుతోంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×