BigTV English

Sachin Tendulkar : భారతదేశ చరిత్రలో ఎక్కువ సార్లు వరల్డ్ కప్ టోర్నీలో ఆడిన క్రికెటర్ అతడే…

Sachin Tendulkar : భారతదేశ చరిత్రలో ఎక్కువ సార్లు వరల్డ్ కప్ టోర్నీలో ఆడిన క్రికెటర్ అతడే…
Sachin Tendulkar

Sachin Tendulkar : క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ 2023 మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఈరోజు అనగా అక్టోబర్ 5వ తారీఖున ఇంగ్లాండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ,న్యూజిలాండ్ రన్నరప్స్ మధ్య తొలి పోరు కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. ఇక రోజు మ్యాచ్లతో క్రికెట్ అభిమానులు కన్నుల పండుగగా ఎంజాయ్ చేస్తారు.


వరల్డ్ కప్ 2023 కి ఆతిధ్యం ఇస్తున్న భారత జట్టు అక్టోబర్ 8వ తారీఖున ఆస్ట్రేలియా టీం తో తన తొలి మ్యాచ్ ఆడబోతోంది. ఈసారి జరగబోతున్న వరల్డ్ కప్ చాలా మంది ఆటగాళ్లకు మొదటిసారి అవుతుంటే మరికొందరికి మళ్లీ ఈ అవకాశం రాకపోవచ్చు. అయితే ఒక ఆటగాడు మాత్రం వరల్డ్ కప్ టోర్నీలలో అత్యధిక సార్లు భారత్ తరఫున ఆడడం జరిగింది. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో తెలుసా?

భారత్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇప్పటికే మూడు వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొని తన సత్తా చూపించాడు. అతను ఇప్పుడు పాల్గొంటున్న వరల్డ్ కప్ 2023 మ్యాచ్ అతనికి నాలుగవ వరల్డ్ కప్ అవుతుంది. అయితే విరాట్ కంటే ముందే మాజీ క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ ,అజారుద్దీన్ ,అనిల్ కుంబ్లే ,జవగల్‌ శ్రీనాథ్‌, ఎంఎస్‌ ధోనీ…ఈ ఆటగాళ్లందరూ ఇప్పటికే తమ ఖాతాలో నాలుగేసి వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడారు. ఇక ఇప్పుడు జరగబోయే మ్యాచ్ ఆడిన తర్వాత విరాట్ కోహ్లీ కూడా వారి జాబితాలో చేరుతాడు.


నాలుగు కంటే ఎక్కువ మ్యాచులు ఆడిన ఒక క్రికెట్ దిగ్గజం మన టీం లో ఉన్నాడు. అతను మరెవరో కాదు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. సచిన్ అంటే క్రికెట్ చరిత్రలో ఒక సంచలనం. ఇండియన్ క్రికెట్ ను తారస్థాయికి తీసుకు వెళ్లడంలో సచిన్ ఎంతో కృషి చేశాడు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ సచిన్ చేసిన కొన్ని రికార్డులు బ్రేక్ చేసే మరొక క్రికెటర్ లేరు అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

ఇక అందరికంటే ఎక్కువ వరల్డ్ కప్ టోర్నీలు ఆడిన వ్యక్తిగా కూడా భారత్ లో సచిన్ కు ఒక రికార్డు ఉంది. నాలుగో …ఐదో టోర్నీలు కాదు ఏకంగా ఆరు క్రికెట్ వరల్డ్ మ్యాచ్లలో భారత్ కు సచిన్ ప్రాతినిధ్యం వహించాడు. అతను ప్రాతినిథ్యం వహించిన ఆరు వరల్డ్ కప్ మ్యాచ్లకు గాను 2011లో జరిగిన వరల్డ్ కప్ టైటిల్ ను భారత్ గెలుచుకోవడం జరిగింది. మొత్తానికి సచిన్ 1992, 1996, 1999, 2003, 2007, 2011 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్లలో సచిన్ పాల్గొనడమే కాకుండా ఒకసారి వరల్డ్ కప్ విజేతగా కూడా నిలవడం జరిగింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×