Sachin Tendulkar gave an unexpected shock to the photographers: భారత లెజెండరీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే తాను క్రికెట్ పిచ్‌లోకి ఎంట్రీ ఇస్తే చాలు కోట్లాది అభిమానులు తన గేమ్‌ని చూసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. తన బ్యాటింగ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. ఇక క్రికెట్ ఆటకు వీడ్కోలు పలికి 11 ఏండ్లు గడుస్తున్నా.. అతడి మాస్ క్రేజ్ ఏం మాత్రం తగ్గనేలేదు. సచిన్ ఎక్కడ కనిపించినా సరే ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెబుతుంటారు. ఇదంతా బాగానే ఉంది కానీ..సచిన్ ఫొటోగ్రాఫర్లకు ఊహించని రీతిలో అందరికి షాక్ ఇచ్చాడు. అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే…
బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ ఎకా లఖానీ ఎంగేజ్‌మెంట్‌కు సచిన్ తన ఫ్యామిలీతో వెళ్లాడు. భార్య అంజలి, కూతురు సారా టెండూల్కర్‌తో కలిసి ఆ వేడుకకు హాజరయ్యాడు. అంతకంటే ముందు తన ఫ్యామిలీతో పాటు కెమెరాలకు స్టిల్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఫొటోగ్రాఫర్లు సారా సోలో ఫొటో తీయాలని ట్రై చేశారు.అయితే సచిన్ మాత్రం వాళ్లని సైలెంట్‌గా ఉండండి అంటూ చేయి చూపించాడు. అంతేకాదు తన కూతురు సారా ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో తను అలా నో చెప్పాడు.
Also Read: క్రీడలను కెరీర్‌గా ఎంచుకోండని సూచించిన మనూ భాకర్
ఇప్పటికైతే ఆమెను వదిలేయండని అంటూ అక్కడి నుంచి సారాను తీసుకొని వెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతూ ట్రెండింగ్ అవుతోంది. ఆ వీడియోలో సచిన్ సమయస్ఫూర్తికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘పిల్లల ప్రైవసీని కాపాడే తండ్రిగా సచిన్ వ్యహరించిన తీరుపై నెటిజన్లు, తన ఫ్యాన్స్ సూపర్ అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">