E-Paper
Advertisement

Semi Finals :మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీస్‌లో సానియా-బోపన్న జోడీ

Semi Finals :మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీస్‌లో సానియా-బోపన్న జోడీ
Advertisement

Semi Finals:ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత ద్వయం సానియా మీర్జా-రోహన్ బోపన్న… మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సెమీఫైనల్ చేరారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నుంచి ఒస్టాపెంకో-హెర్నాండెజ్ జోడీ తప్పుకోవడంతో… సానియా-బోపన్న జోడీ వాకోవర్ ద్వారా సెమీస్ చేరింది. కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్‌ ఆడుతున్న సానియా మీర్జా… తన లాస్ట్ టైటిల్‌కు మరో రెండు మ్యాచ్‌ల దూరంలో ఉంది. ఒకవేళ సానియా-బోపన్న జోడీ గనుక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి టైటిల్ పట్టేస్తే… సానియా ఖాతాలో ఏడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ చేరుతుంది. ఇప్పటివరకు విమెన్స్ డబుల్స్‌లో 3, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో 3 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచింది… సానియా.

ఇక మహిళల సింగిల్స్ విభాగంలో రైబాకినా, అజరెంకా సెమీఫైనల్ చేరారు. వీళ్లిద్దరి మధ్యే ఒక సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో కారెన్, స్టెఫానోస్ సెమీఫైనల్లో అడుగుపెట్టారు. వీళ్లిద్దరూ ఒక సెమీఫైనల్లో తలపడనున్నారు.

Advertisement

మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్యాకు చెందిన 25వ ర్యాంకర్ ఎలెనా రైబాకినా… లాత్వియాకు చెందిన 17వ ర్యాంకర్ ఒస్టాపెంకోపై 6-2, 6-4 స్కోరుతో ఈజీగా గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఇక మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో… అమెరికాకు చెందిన 3వ ర్యాంకర్ జెస్సికా పెగ్యులాపై… బెలారస్‌కు చెందిన 24వ ర్యాంకర్ అజరెంకా… 6-4, 6-1 తేడాతో సునాయాసంగా గెలిచి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.

మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్యాకు చెందిన 20వ ర్యాంకర్ కారెన్ ఖచనోవ్… అమెరికాకు చెందిన 31వ ర్యాంకర్ సెబాస్టియన్ కోర్డాపై 7-6, 6-3, 3-0 తేడాతో గెలిచాడు. మూడో సెట్ జరుగుతున్న సమయంలో సెబాస్టియన్ గాయం కారణంగా ఆట నుంచి తప్పుకున్నాడు. దాంతో… కారెన్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో… చెక్ రిపబ్లిక్ కు చెందిన 71వ ర్యాంకర్ జిరి లెహెకాపై… గ్రీస్‌కు చెందిన స్టెఫానోస్ 6-3, 7-6, 6-4 తేడాతో గెలిచి సెమీస్ చేరాడు.

Advertisement

Follow this link for more updates:- Bigtv live updates

Tags

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×