BigTV English

Lunar Missions: చంద్రుడిపైకి శాటిలైట్లు.. దేశాల మధ్య చిచ్చు..

Lunar Missions: చంద్రుడిపైకి శాటిలైట్లు.. దేశాల మధ్య చిచ్చు..

Lunar Missions:ఇప్పటికే చంద్రుడిపైకి ఎన్నో శాటిలైట్లు వెళ్లాయి. వాటి ద్వారా ఎన్నో ప్రయోగాలు జరిగాయి. అందులో కొన్ని సక్సెస్ అవ్వగా మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. కానీ ఇప్పటికీ చాలా శాటిలైట్లు చంద్రుడి చుట్టు తిరుగుతూనే ఉన్నాయి. దీంతో చంద్రుడి దగ్గర మోతాదుకంటే ఎక్కువ వేడి నమోదవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.


రానున్న దశాబ్ది కాలంలో దాదాపు 100 ల్యూనార్ మిషిన్లు అంతరిక్షంలోకి వెళ్లనున్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ కంపెనీలు మాత్రమే కాకుండా ఎన్నో ప్రైవేట్ కంపెనీలు కూడా చంద్రుడిపై వాటి పరిశోధనలు చేయాలని ఆలోచనలో ఉండడమే దీనికి కారణం. అయితే ఒకేసారి అంతరిక్షంలోకి అన్ని శాటిలైట్లు వెళ్లడం ద్వారా అనేక కొత్త సమస్యలు వస్తాయని వారు భావిస్తున్నారు.

సిస్లూనార్ స్పేస్‌లో శాటిలైట్ల సంఖ్య పెరిగిపోవడం ద్వారా భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరంలో శాటిలైట్లే నిండిపోయింటాయి. దీని ద్వారా శాటిలైట్లకు స్థలం దొరకడం ఇబ్బందువుతుంది. అంతే కాకుండా దీని చుట్టూ పలు రాజీకీయ వివాదాలు కూడా మొదలవ్వనున్నట్టు తెలుస్తోంది.


అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపించే విషయంలో ఇప్పటికే చైనా ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా.. శాటిలైట్ల స్థానాన్ని చైనాకు దగ్గకుండా చేయాలని, సిస్లూనార్ స్పేస్‌లో స్థలం తమదేనని ఛాలెంజ్‌లు విసురుతోంది. చైనా కూడా ఈ ఛాలెంజ్‌ను తిప్పికొడుతోంది.

ఇప్పటికే అమెరికా, చైనా లూనార్ శాటిలైట్ల తయారీలో వేగం పెంచాయి. ఆ రెండు దేశాలు ఆస్ట్రానాట్స్‌ను చంద్రుడిపైకి పంపించడంతో పాటు అక్కడే మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు దేశాలతో పాటు సౌత్ కొరియా, యూఏఈ, ఇండియా, రష్యా దేశాలు కూడా ఈ పోటీలో భాగం కావాలని ఆలోచనలు చేస్తున్నాయి.

చాలా కమర్షియల్ కంపెనీలు కూడా చంద్రుడిని తాకాలనే కలతో ఉన్నాయి. స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీ ఈ ఏడాదిలోనే లూనార్ ఆర్బిట్‌లోకి ఓ టూరిజం విమానాన్ని పంపించాలనే ప్లానింగ్‌లో ఉన్నాయి. అమెరికా, జపాన్, ఇజ్రాయిల్‌లోని కంపెనీలు కూడా పలు విధమైన ప్లానింగ్‌లతో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

అంతరిక్షంలోకి, చంద్రుడిపైకి వెళ్లడం సులభతరం చేయడం మానవాళికి కొత్త లాభాలు తెచ్చిపెట్టనున్నాయి. కానీ మరో వైపు దేశాల మధ్య పోటీని కూడా పెంచనున్నాయి. రాజకీయపరంగా, ఆర్థికంగా కూడా దేశాల మధ్య పోటీ విపరీతంగా పెరగనుంది. సిస్లూనార్ స్పేస్‌లో కూడా శాటిలైట్ల సంఖ్య పెరగడం వల్ల జరిగే పరిణామాలను ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×