BigTV English

War: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ యుద్ధ ట్యాంకర్లు

War: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ యుద్ధ ట్యాంకర్లు

War: ఉక్రెయిన్‌పై రష్యా వార్ కొనసాగుతూనే ఉంది. యుద్ధం ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తున్నా ముగింపు మాత్రం కనిపించటం లేదు. రోజురోజుకు యుద్ధం భీకరంగా మారుతోంది. తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు ఉక్రెయిన్ సాయశక్తులా పోరాడుతోంది. ఇంకా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యుద్ధ ట్యాంకర్లు కావాలని ఉక్రెయిన్ ప్రపంచదేశాలను కోరుతోంది.


ఈక్రమంలో ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకర్లు అందించేందుకు అమెరికా, జర్మనీ దేశాలు ముందుకొచ్చాయి. ఈ రెండు దేశాలు ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకర్లు పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాదాపు 30 ఎం1 అబ్రామ్స్ ట్యాంకులను పంపించాలని అమెరికా, 14 లియోపార్డ్ 2 ట్యాంక్‌లను పంపించాలని జర్మనీ దేశాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ ట్యాంకులు ఉక్రెయిన్‌కు చేరితే యుద్ధం కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది.

ఈ యుద్ధ ట్యాంకర్లు తమ చేతికి రావడం వల్ల రష్యా ఆధీనంలోకి వెళ్లిన తమ భూభాగాన్ని మళ్లీ చేజిక్కించుకోవచ్చని ఉక్రెయిన్ అధికారులు భావిస్తున్నారు. కానీ రష్యా మాత్రం అమెరికా, జర్మనీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతోంది. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకర్లు పంపించడం అంటే యుద్ధాన్ని రెచ్చగొట్టడమే అని రష్యా పేర్కొంది.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×